
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ దూకుడు పెంచనున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 7న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కీలకసమావేశం నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు కరోనా సోకడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో కార్యక్రమాలు ముందుకు సాగలేదు.తర్వాత ఆయన కోలుకున్నా పెద్దగా యాక్టివ్ కాలేదు.
ప్రభుత్వం చేసే కార్యక్రమాలపై బీజేపీ నిరసన చేపట్టినా అందులో జనసేన కలవలేదు. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా పోరాడుతామన్న అభిప్రాయాలు జనంలో కల్పించలేకపోయారు. ప్రస్తుతం రాష్ర్టంలో సవాలక్ష సమస్యలున్నా ఎవరు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రతిపక్షాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నా పట్టించుకోవడం లేదు
ప్రభుత్వం ఇచ్చే సెంట్ స్థలాల్లో సొంత డబ్బులు పెట్టుకుని గ్రౌండింగ్ చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై పోరాడేందుకు ప్రతిపక్షాలు ముందుకు రావడం లేదు. వరుస కుంభకోణాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం సమస్యలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చిన సందర్భంగా జనసేన రాష్ర్టంలో ముందుకు రావాలని ఆశిస్తున్నారు.
ఇన్నిసమస్యలు ఉన్నా ఇంత కాలం జనసేన పట్టించుకోకపోవడంతో ఉనికి కనిపించలేదు. ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండకూడదని భావించారు. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో అసంతృప్తి పేరుకుపోయిందని తెలిసినా ఎక్కడ కూడా నిలదీసే పని చేయడం లేదు.