
తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మద్యం ప్రియులకు ఆనందం కలుగుతోంది. బీర్లపై రూ.10 మేర తగ్గించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా తీసుకునన నిర్ణయంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. సర్కారు తమ కోసమే ధర తగ్గించిందని తెగ సంబరపడిపోతున్నారు. బీర్ల ధరలు తగ్గిస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది.
బీరు సీసాపై రూ.10 తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రత్యేక ఎక్సైజ్ సెస్ పేరుతో సీపాపై రూ.30 ప్రభుత్వం విధించింది. ప్రత్యేక ఎక్సైజ్ నుంచి రూ.10 తగ్గించింది. ప్రత్యేక సెస్ తగ్గింపు ఈరోజు నుంచే అమల్లోకి వస్తోంది. దీంతో మందుబాబుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో అందరు అనుమానాలు వ్యక్తం చేసినా మంచి పని అనే చర్చించుకుంటున్నారు.
ఇప్పటివరకు ఉన్నసెస్ ఇప్పుడే ఎందుకు తగ్గించిందనే ప్రశ్న తలెత్తుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దళితుల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం బీర్ల ధరలు సైతం తగ్గించిందనే చెబుతున్నారు.
ఎప్పుడు తగ్గించని ప్రభుత్వం ఈషారి బీర్ల ధరలు తగ్గించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నా అదేం లేదని ప్రభుత్వం బుకాయిస్తోంది. కానీ ముందుచూపుతోనే ఇలా చేసిందని ప్రజల నుంచి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల తంతు ప్రారంభం అయిన తరువాత ఆ అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే ముందుగానే ప్రభుత్వం ఇలా ధరలు తగ్గించుకుందని తెలుస్తోంది.