Homeఅంతర్జాతీయంPresident Muizzu: మాల్దీవుల అధ్యక్షుడికి మరో సంకటం

President Muizzu: మాల్దీవుల అధ్యక్షుడికి మరో సంకటం

President Muizzu: అన్నం పెట్టిన ఇంటికి సున్నం పెట్టే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది.. అచ్చం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు లాగా ఉంటుంది. లక్షదీప్ గురించి.. అక్కడ పర్యాటకం గురించి నరేంద్ర మోడీ మాట్లాడగానే.. మాల్దీవులకు చెందిన మంత్రులు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో భారతదేశ పర్యటకానికి కించ పరుస్తూ మాట్లాడారు. దీంతో భారతీయులకు మండి మాల్దీవుల పర్యటన రద్దుచేసుకున్నారు. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చినట్టుగా లక్ష ద్వీప్ ప్రాంతానికి తరలి వెళ్తున్నారు. సహజంగానే పర్యటక ఆదాయం మీద బతికే మాల్దీవులకు.. ఇండియన్స్ నుంచి నిరసన ఇది కావడంతో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.. అయితే ఇదే సమయంలో భారతదేశానికి శత్రుదేశమైన చైనాతో మాల్దీవుల ప్రధాని స్నేహాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు. అంతేకాదు పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నాడు. మాల్దీవుల వివాదం కొనసాగుతుండగానే చైనాలో పర్యటించాడు. చైనా నుంచి రాగానే మాల్దీవుల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని వెనక్కి వెళ్ళిపోవాలని స్పష్టం చేశాడు. అయితే అప్పట్లో ముయిజ్జు చైనా ప్రాపకం వల్ల తమ పర్యాటక ఆదాయానికి డోకా ఉండదని భావించాడు. చైనా దేశస్తులు తమ దేశంలో పర్యటించాలని కూడా కోరాడు. దానికి అక్కడ ప్రభుత్వ పెద్దలు ఒప్పుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే మాల్దీవుల ప్రభుత్వం ఆశించిన విధంగా చైనా దేశస్తులు అక్కడ పర్యటించడం లేదు. పర్యటకం మీద ఆధారపడి బతికే మాల్దీవుల దేశస్థులకు ఇది ఒక రకంగా పెద్ద ఎదురు దెబ్బ. ఆదాయం లేకపోవడంతో వరకు హోటల్స్ మూసి ఉంటున్నాయి. అంతేకాదు విమాన టికెట్లు కూడా బుక్ కాకపోవడంతో పలు సంస్థలు తమ సర్వీస్ లను రద్దు చేసుకుంటున్నాయి. ఇదంతా జరుగుతుండగానే పులి మీద పుట్ర లాగా ముయిజ్జి ప్రభుత్వానికి ఒక తలనొప్పి ఎదురయింది. అది ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేసింది.

ముయిజ్జి భారత వ్యతిరేక విధానాలు అవలంబిస్తుండడం, చైనాకు అనుకూలంగా ఉండటంతో అక్కడ పార్లమెంట్లో పెద్ద ఎత్తున డుమారం చెల రేగుతోంది.. అంతేకాదు ముయిజ్జి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ అభిశంసన తీర్మానం కూడా త్వరలో ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉంది. ముయిజ్జి చైనా అనుకూల విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో భారత్ నుంచి పర్యాటకులు మాల్దీవులు రావడం మానేశారు. దీంతో విమానయాన, హోటల్ రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. దీని మీద ఆధారపడిన చాలా మంది రోడ్డున పడుతున్నారు. అయితే చైనా నుంచి ఆశించిన విధంగా పర్యాటకులు రావడం లేదు. ఫలితంగా ఇది మాల్దీవుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మాల్దీవులు మరింత ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంటుంది. అయితే పరిస్థితి అంతకు దిగజారకముందే మేలుకోవాలని.. చైనా అనుకూల ముయిజ్జి ని దించేయాలని అక్కడి ప్రతిపక్ష సభ్యులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జి పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

మాల్దీవుల పార్లమెంట్లో మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ కి ప్రతిపక్ష హోదా ఉంది. ఇతర డెమోక్రటిక్ సభ్యుల సహాయంతో మొత్తం 34 మంది మాల్దీవుల అధ్యక్షుడికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే సంతకాల సేకరణ కూడా పూర్తి చేశారు. ముయిజ్జు విధానాల వల్ల దేశం నష్టపోతుందని, భారత వ్యతిరేక ధోరణి తమదేశానికి మంచిది కాదని వారు అభిప్రాయపడుతున్నారు.. మరొకటి కొత్తగా ముయిజ్జి ప్రభుత్వం నలుగురు మంత్రులను క్యాబినెట్లోకి తీసుకుంది. ఆ తర్వాత మరుసటి రోజు జరిగిన ఓటింగ్ లో అక్కడ ఎంపీలు గొడవపడ్డారు. నలుగురు మంత్రుల నియామకమాన్ని మాల్దీవీయన్ డెమొక్రటిక్ ఫ్రంట్, ఇతర పార్టీల ఎంపీలు వ్యతిరేకించారు. అయితే మరో సెషన్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.. సోమవారం కూడా ఓటింగ్ నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు.. మరోవైపు ముయిజ్జి చైనాతో చేసుకున్న ఒప్పందాల వల్ల మార్చి లో తమ దేశంలో ఉన్న 88 సైనికులు తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశించారు. అంతేకాదు భారతదేశంతో చేసుకున్న ఒప్పందాలను మరలా సమీక్షిస్తామని ప్రకటించారు. దీంతో మాల్దీవుల ప్రతిపక్ష పార్టీల నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. దేశానికి వ్యతిరేకంగా కుదుర్చుకునే ఒప్పందాల వల్ల అభివృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని.. ఇది మంచి పరిణామం కాదని ప్రకటించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular