https://oktelugu.com/

Mahatma Gandhi: గాంధీజీ చెప్పులు, బ్యాగు, వీలునామా.. వేలంలో ఎన్ని లక్షలకు పాడారో తెలుసా?

మహాత్మా గాంధీ తన జీవితంలో ఉపయోగించిన వస్తువులు తరువాత గుజరాతీ భాషలో రాసిన రెండు పేజీల వీలునామా అత్యంత ఖరీదుగా మారింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 2, 2023 / 12:13 PM IST
    Follow us on

    Mahatma Gandhi: మహాత్మాగాంధీ.. భారత జాతిపిత. శాంతియుతంగా దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన సారథి. అందకే యావత్‌ దేశం ఆయనను జాతి పితగా సంబోధిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మహాత్ముడికి కీర్తి ఉంది. ఆయన బ్రిటిష్‌వారిపై చుక్క రక్తం చిందకుండా చేసిన పోరాటం.. సాధించిన స్వాతంత్య్రం ఎన్నో ఉద్యమాలకు, ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. అందుకే ప్రపంచంలోని చాలా దేశాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్టోబర్‌ 2న దేశం మొత్తం అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని జరుపుకుంటుంది. గాంధీజీకి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అరుదైన గాంధీ వస్తువుల గురించి మనం తెలుసుకుందాం. గాంధీ వస్తువులను వేలం వేశారు. అవి అత్యధిక ధర పలికాయి. గాంధీజీ వీలునామా అత్యంత ఖరీదుకు అమ్ముడయింది. వేలంలో గాంధీజీకి సంబంధించిన బ్రౌన్‌ స్లిప్పర్, లెదర్‌ బ్యాగ్‌ కూడా అమ్ముడయ్యాయి. ఈ రెండు వస్తువులకు కొనుగోలుదారులు చాలా ఎక్కువ ధరలను చెల్లించారు.

    గుజరాతీ భాషలో వీలునామా..
    మహాత్మా గాంధీ తన జీవితంలో ఉపయోగించిన వస్తువులు తరువాత గుజరాతీ భాషలో రాసిన రెండు పేజీల వీలునామా అత్యంత ఖరీదుగా మారింది. నిజానికి మహాత్మా గాంధీ రెండు పేజీల్లో రాసిన వీలునామా వేలంలో 55 వేల పౌండ్లు పలికింది. ఇది నేటి భారతీయ రూపాయలలో రూ.55 లక్షల కంటే ఎక్కువ. దీని వేలం కోసం ప్రారంభమైన బిడ్డింగ్‌ 30 నుంచి∙40 వేల పౌండ్ల వరకు ప్రారంభం కావడం అతిపెద్ద విషయం. అయితే ఈ వీలునామాను ఎవరు కొనుగోలు చేశారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.

    ఆ వస్తువులు కూడా..
    అదే వేలంలో గాంధీజీ బ్రౌన్‌ లెదర్‌ స్లిప్పర్‌ ఒకటి కూడా వేలానికి వచ్చింది. దీని కోసం కొనుగోలుదారులు 19 వేల పౌండ్ల వేలం వేశారు. దీన్ని భారత రూపాయిల్లోకి మార్చినట్లయితే దాదాపు రూ.19 లక్షలు అవుతుంది. బీబీసీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం, ముంబైలోని జుహుబీచ్‌ సమీపంలోని ఆ ఇంట్లో నివసించే వారి నుంచి ఈ చెప్పులు దొరికాయి. ఇవన్నీ మహాత్మా గాంధీ 1917 నుంచి 1934 వరకు ఇక్కడ నివసించారు.