https://oktelugu.com/

ట్రెండింగ్: ఒక్క యాడ్.. ‘బాయ్ కాట్ తనిష్క్’.. దేశవ్యాప్తంగా దుమారం

అదొక ముస్లిం కుటుంబం.. అందులోకి ప్రేమించి పెళ్లి చేసుకొని హిందూ యువతి కోడలుగా వస్తోంది. ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. సీమంతానికి రంగం సిద్ధమవుతుంది. . సీమంతం సందర్భంగా ఆ ఇంటిలో హిందూ సంప్రదాయంలో ఏర్పాట్లు ఉండడంతో ఆమె ఆశ్చర్యపోతుంది. ముస్లిం ఇంట్లో ఇలాంటివి చేస్తారా? అని ఆ యువతి తన అత్తను ప్రశ్నిస్తుంది. దానికి ఆమె అత్తయ్య.. ఇక్కడ సంప్రదాయాలు కాదు.. ప్రేమలే ఉంటాయి.. అంటూ యాడ్ తీర్చిదిద్దారు. రెండు మతాలు, సంస్కృతుల కలయిక అన్నట్టుగా ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 / 07:20 PM IST
    Follow us on

    అదొక ముస్లిం కుటుంబం.. అందులోకి ప్రేమించి పెళ్లి చేసుకొని హిందూ యువతి కోడలుగా వస్తోంది. ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. సీమంతానికి రంగం సిద్ధమవుతుంది. . సీమంతం సందర్భంగా ఆ ఇంటిలో హిందూ సంప్రదాయంలో ఏర్పాట్లు ఉండడంతో ఆమె ఆశ్చర్యపోతుంది. ముస్లిం ఇంట్లో ఇలాంటివి చేస్తారా? అని ఆ యువతి తన అత్తను ప్రశ్నిస్తుంది. దానికి ఆమె అత్తయ్య.. ఇక్కడ సంప్రదాయాలు కాదు.. ప్రేమలే ఉంటాయి.. అంటూ యాడ్ తీర్చిదిద్దారు. రెండు మతాలు, సంస్కృతుల కలయిక అన్నట్టుగా ఈ యాడ్ లో తనిష్క్ ఆభరణాల సంస్థ ఒక ప్రకటనలో చూపించింది.

    Also Read: సీఎం, గవర్నర్ డిష్యూం.. డిష్యూం

    అయితే ఈ యాడ్ ‘లవ్ జిహాద్’ను ప్రేరేపించేలా ఉందని జాతీయవాదులు, కొందరు బీజేపీ హిందుత్వ వాదులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీంతోపాటు ‘తనిష్క్’ను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడిచింది. దీంతో తనిష్క్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం నుంచి ఆ యాడ్ ను తొలగించింది. అయితే అప్పటికే ఆ వీడియోను సేవ్ చేసుకున్న వీడియోను షేర్ చేస్తూ తనిష్క్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరు మాత్రం తనిష్క్ కు సపోర్టు చేస్తూ అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ తనిష్క్ యాడ్ కు మద్దతు తెలిపారు.

    ప్రముఖ ఆభరణాల సంస్థ ‘తనిష్క్’ తాజాగా విడుదల చేసిన ఒక యాడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. మంచి ఉద్దేశంతోనే తీసినా.. హిందూ, ముస్లింల ఏకత్వాన్ని చూపిస్తూ చేసిన ఈ యాడ్ పై నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జాతీయ వాదులు ఈ యాడ్ పై మండి పడి ట్రోల్స్ చేశారు. తనిష్క్ వాణిజ్య ప్రకటనతో ‘లవ్ జిహాద్’ను ప్రచారం చేస్తోందని సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ట్విట్టర్ లో అయితే ‘బాయ్ కాట్ తనిష్క్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు.

    Also Read: భారత్ కరోనా తగ్గుముఖం.. మరో మూడునెలల్లో జీరో కానుందా?

    దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ ను ప్రేరేపించేలా ఆ యాడ్ ఉందన్న విమర్శలు రావడంతో తనిష్క్ ఆభరణాల సంస్థ వెనక్కి తగ్గింది. తన యాడ్ ను వెంటనే ఉపసంహరించుకుంది. ‘ఏకత్వం’ పేరుతో తనిష్క్ కొత్త ఆభరణాలు లాంచ్ చేసింది. ఇందుకు సంబంధించిన యాడ్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. టీవీల్లోనూ ప్రకటన చేసింది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.