తెలంగాణ సరిహద్దుల్లో మహారాష్ట్ర రైతులు ఆందోళన చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మహారాష్ట్ర-తెలంగాణకు అనుబంధంగా గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం జరిగిన సంగతి తెల్సిందే. అయితే మహారాష్ట్రలో కరోనా కేసుల కారణంగా కొద్దిరోజులుగా ఈ బ్యారేజ్ నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read: టీపీసీసీ ఎంపికపై చేతులేత్తేసిన కాంగ్రెస్ అధిష్టానం..!
ఈక్రమంలోనే బీజేపీ బీజేపీ గడ్జిరోలి జిల్లా ప్రధాన కార్యదర్శి సందీప్ కోరేట్ ఆధ్వర్యంలో సుమారు 500మంది రైతులు నేడు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిరసన చేపట్టారు. గతంలో మాదిరిగానే మేడిగడ్డ బ్యారేజ్‌పై నుంచి రాకపోకలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కొంతకాలంగా రాకపోకలు నిలిపివేయడంతో పొరుగునే ఉన్న గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు.అదేవిధంగా బ్యారేజ్ బ్యాక్ వాటర్ వల్ల పొరుగునే ఉన్న పలు గ్రామాల్లో పంట భూములు కోతకు గురవుతున్నాయని మహారాష్ట్ర రైతులు ఆరోపించారు.
Also Read: కేసీఆర్ ‘ఎల్ఆర్ఎస్’పై సుప్రీంకోర్టుకు..
ముంపునకు గురికాని ప్రాంతంలో సాగుచేసినా పంటలు నాశనం అవుతున్నాయని రైతులు వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం తమకు న్యాయం చేసేవరకు కదిలేదని మహారాష్ట్ర రైతులు స్పష్టం చేశారు.ఈ విషయం తెలుసుకున్న కాటారం డీఎస్పీ బోనాల కిషన్ మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు.
ఆందోళన చేస్తున్న రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. సరిహద్దు గ్రామాల రైతుల డిమాండ్లను.. ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పడంతో రైతులు శాంతించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్