https://oktelugu.com/

ఎన్టీఆరా? మజాకా.. ఆ టీవీ షోకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

బిగ్ బాస్ తొలి సీజన్ ను ఎంతో రక్తికట్టించి తెలుగు వారి మనసు దోచుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా సత్తా చాటారు. ఎన్టీఆర్ హావభావాలు.. షో నడిపించిన తీరు ఫిదా చేసింది. అయితే ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వల్ల బిగ్ బాస్ కు దూరమయ్యారు. ఆ షో నిర్వాహకులు చేయమన్నా చేయలేకపోయారు. Also Read: రెండో పెళ్ళికి సిద్దమైన రాఘవేంద్రరావు కోడలు ! తాజాగా ఆర్ఆర్ఆర్ ముగియడంతో మళ్లీ ఎన్టీఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2020 / 03:56 PM IST
    Follow us on

    బిగ్ బాస్ తొలి సీజన్ ను ఎంతో రక్తికట్టించి తెలుగు వారి మనసు దోచుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా సత్తా చాటారు. ఎన్టీఆర్ హావభావాలు.. షో నడిపించిన తీరు ఫిదా చేసింది. అయితే ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వల్ల బిగ్ బాస్ కు దూరమయ్యారు. ఆ షో నిర్వాహకులు చేయమన్నా చేయలేకపోయారు.

    Also Read: రెండో పెళ్ళికి సిద్దమైన రాఘవేంద్రరావు కోడలు !

    తాజాగా ఆర్ఆర్ఆర్ ముగియడంతో మళ్లీ ఎన్టీఆర్ బుల్లితెర వైపు అడుగులు వేస్తున్నారు. జెమినీ టీవీలో ఎన్టీఆర్ ఓ షో చేయబోతున్నట్టు తెలిసింది. ఇప్పుడు దానికి సంబంధించిన షూటింగ్ మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోతున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చినట్టు టాలీవుడ్ సమాచారం.

    జెమినీ టీవీకి మొత్తం 60 ఎపిసోడ్లను ఎన్టీఆర్ చేయబోతున్నట్టు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ కు ఎన్టీఆర్ కు ఇచ్చే రెమ్యూనరేషన్ తెలిస్తే మీకు భైర్లు కమ్మాల్సిందే.. ఏకంగా 30 లక్షలు ఒక ఎపిసోడ్ కు తీసుకుంటున్నారట.. అంటే టోటల్ గా జెమినీ టీవీ నుంచి ఎన్టీఆర్ కు వచ్చేది 18 కోట్లు. అంటే ఎన్టీఆర్ ఒక సినిమాకు తీసుకున్నదానికంటే కూడా ఎక్కువ కావడం విశేషం.

    Also Read: హీరోల చుట్టూ తిరుగుతోన్న యంగ్ బ్యూటీ !

    18 కోట్లు అంటే తెలుగు టీవీ చరిత్రలోనే అతిపెద్ద రెమ్యూనరేషన్ గా బుల్లితెర వర్గాలు పేర్కొంటున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో సాగే ఈ కార్యక్రమానికి కొత్త పేరు పెడుతున్నట్టు తెలిసింది. త్వరలోనే ఇది వెల్లడి కానుంది.

    ఫిబ్రవరిలో ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తికానుంది. ఆ తర్వాత ఈ షో చేస్తారు. దీంతో పాటు త్రివిక్రమ్ తో ఓ సినిమాను మొదలు పెడుతారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్