https://oktelugu.com/

ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలుస్తానంటున్న మెగా హీరో !

మెగా కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీలోకి డజను మంది వరకు హీరోలు వచ్చారు. అందరూ తలొక శైలిలో సినిమాలు చేసుకుంటూ ప్రతిభకి పదును పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు.అయితే మేనమామ చిరంజీవి పోలికలతో అలరిస్తున్న సాయిధరమ్ ‌తేజ్ కేవలం బ్యాక్‌గ్రౌండ్‌నే నమ్ముకోకుండా తనదైన టాలెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వరుసగా ఫ్లాపులు వచ్చినా పుంజుకుని మారుతీ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి రేస్ లో కి వచేసాడు. తాజాగా తేజ్ నటించిన […]

Written By:
  • admin
  • , Updated On : December 16, 2020 / 04:33 PM IST
    Follow us on


    మెగా కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీలోకి డజను మంది వరకు హీరోలు వచ్చారు. అందరూ తలొక శైలిలో సినిమాలు చేసుకుంటూ ప్రతిభకి పదును పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు.అయితే మేనమామ చిరంజీవి పోలికలతో అలరిస్తున్న సాయిధరమ్ ‌తేజ్ కేవలం బ్యాక్‌గ్రౌండ్‌నే నమ్ముకోకుండా తనదైన టాలెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వరుసగా ఫ్లాపులు వచ్చినా పుంజుకుని మారుతీ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి రేస్ లో కి వచేసాడు. తాజాగా తేజ్ నటించిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’…డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్దమవుతుంది . కరోనా కారణం చేత థియేటర్లు మూతపడిన తర్వాత సినిమాలన్నీ ఓటిటి ప్లాట్ ఫామ్ లలో విడుదల చేస్తున్నారు. కరోనా సడలింపులు తర్వాత ఇటీవలనే థియేటర్ లు తిరిగి ప్రారంభమయ్యాయి . ఇప్పటివరకు చిన్న చితకా సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి, ఇలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకొస్తున్న పెద్ద హీరో సినిమా “సోలో బ్రతుకే సో బెటర్” కావడంతో ఇండస్ట్రీ మరియు ప్రేక్షకుల ఫోకస్ అంతా ఈ మూవీ మీదనే ఉంది .

    Also Read: హీరోల చుట్టూ తిరుగుతోన్న యంగ్ బ్యూటీ !

    మూవీ విడుదలకి దగ్గరవుతుండటంతో ప్రొమోషన్స్లో దూసుకుపోతున్నాడు సాయిధరమ్ ‌తేజ్. తాజాగా ఒక మీడియా ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ… సినిమా విశేషాల గురించి, తన పెళ్లి గురించి ఇంకా అనేక విషయాల గురించి మనసులో మాటలు బయటపెట్టాడు. లాక్ డౌన్ టైం లో థియేటర్లు మూసేసి ఉండటం వలన, పెట్టిన బడ్జెట్ కి వడ్డీలు , నిర్మాతల పరిస్థితులని బట్టి మూవీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ లలోరిలీజ్ అయ్యాయని, కానీ ఇప్పుడు ఓపెన్ చేయటం వలన అన్ని జాగ్రత్తలు తీసుకుని తమ సినిమాను ధైర్యం చేసి థియేటర్లో విడుదల చేస్తున్నట్లు సాయిధరమ్ తేజ్ తెలిపారు. అన్ని సినిమాలు ఓటిటి లో రిలీజ్ చేయలేమని, అలాగే ప్రేక్షకులు థియేటర్ మజాని కోల్పోయారని , తిరిగి ఆ మాజాని ఈ సినిమా ద్వారా పొందుతారని అన్నారు. ప్రేక్షకులని “సోలో బ్రతుకే సో బెటర్” మూవీ మొదటి నుండి చివరి వరకు కదలకుండా కూర్చో పెట్టగలదని , మంచి అనుభూతిని పంచుతుందని ఆయన తెలిపారు.

    అలాగే నిహారిక పెళ్లి తర్వాత మీ పెళ్లి గురించి వస్తున్న వార్తల మీద సమాధానం అడగగా…ఈ 34 సంవత్సరాలు హ్యాపీ గా ఉన్నాను, ఇంకో ఆరు సంవత్సరాలు హ్యాపీ గా ఉందామనుకుంటున్నాను సరదాగా సంభాషించాడు. ఆ తర్వాత మా అమ్మనే గెలుస్తుంది కనుక ఇక అప్పుడు పెళ్లి చేసుకోక తప్పదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి తెలుగు సినిమాల మీదనే తన ఆసక్తి ఉందని, తెలుగు సినిమాలు చేస్తూనే నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకోవాలని అన్నాడు. తెలుగు , తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషలలో నటించిన తర్వాతనే మంచి స్క్రిప్ట్ కుదిరితే హిందీ లో కూడా చేస్తానని యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకి సమాధానమిచ్చాడు. ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలుస్తానన్నాడు.

    Also Read: రొమాన్స్ చేసేటప్పుడు రోజా అన్నయ్య అనేదట !

    ప్రస్తుతం దేవా కట్టాతో ఓ సినిమా చేస్తున్నానని, 60శాతం షూటింగ్ పూర్తి కావొచ్చిందని తేజ్ తెలిపారు. ఇందులో యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తానన్నారు. దీంతో పాటు సుకుమార్‌ రైటింగ్స్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ కలిసి నిర్మిస్తున్న ఓ సినిమాలో నటించనున్నట్లు వెల్లడించారు. 1970, 80 నేపథ్యంలో కథ నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కనుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నారు. సోలో బ్రతుకే సో బెటర్ మూవీ లో అన్ని అంశాలు ఉన్నాయని , ప్రేక్షకులందరూ తగు జాగ్రత్తలు తీసుకుని థియేటర్ కి వచ్చి మూవీని చూసి ఆదరించవలిసిందిగా ఆయన కోరారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్