https://oktelugu.com/

కరోనా ఎఫెక్ట్.. విద్యార్థులకు గుడ్ న్యూస్

దేశంలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. కరోనా కేసులు రోజురోజుకు పెరగడమేగానీ తగ్గుముఖం పట్టడంలేదు. కరోనా కారణంగా విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం కత్తిమీద సాములాంటింది. పరీక్షల కోసం విద్యార్థుల ప్రాణాలను రిస్కులో పెట్టేందుకు వారి తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున విజ్ఞఫ్తులు రావడంతో పరీక్ష నిర్వహాణను ఆయా రాష్ట్రాలకు పరీక్షలను వాయిదా వేశాయి. పార్లమెంట్ భవనాన్ని కూల్చేందుకు కేంద్రం రెడీ? ఇప్పటికే కొన్ని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 29, 2020 / 07:39 PM IST
    Follow us on


    దేశంలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. కరోనా కేసులు రోజురోజుకు పెరగడమేగానీ తగ్గుముఖం పట్టడంలేదు. కరోనా కారణంగా విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం కత్తిమీద సాములాంటింది. పరీక్షల కోసం విద్యార్థుల ప్రాణాలను రిస్కులో పెట్టేందుకు వారి తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున విజ్ఞఫ్తులు రావడంతో పరీక్ష నిర్వహాణను ఆయా రాష్ట్రాలకు పరీక్షలను వాయిదా వేశాయి.

    పార్లమెంట్ భవనాన్ని కూల్చేందుకు కేంద్రం రెడీ?

    ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు లేకుండా పాస్ చేస్తున్నట్లు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతిని అవలంభించారు. పదోతరగతి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులందరినీ ప్రమోట్ చేశాయి. ఇక ఇంటర్మీయట్ పరీక్షలు కరోనా ఎంట్రీకి ముందే నిర్వహించారు. అయితే కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అవగా వీరికి సప్లమెంటరీ నిర్వహించేందుకు ప్రభుత్వాలు సన్నహాలు చేశాయి. అయితే రాష్ట్రంలో కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఫెయిల్ అయిన విద్యార్థందరికీ ప్రభుత్వం కంపార్ట్మెంట్లో పాసనట్లు ప్రకటించింది.

    అయితే యూజీసీ నిబంధనల ప్రకారం డిగ్రీ, పీజీ ఫైనల్ విద్యార్థులకు పరీక్షలు రాయకుండా ప్రమోట్ చేయడం కుదరదు. దీంతో ఈ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ విద్యార్థులకు మధ్యప్రదేశ్ రాష్ట్రంగా తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ చివరి సంవత్సరం, పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలను ఓపెన్ బుక్ విధానంలో నిర్వహించనుంది. విద్యార్థులు ఇంటి నుంచే పరీక్షలు రాయొచ్చని.. జవాబుల కోసం అవసరమైతే పుస్తకాల్లో రిఫర్ చేసుకుని రాయవచ్చునని ఒక సీనియర్ అధికారి తెలిపారు.

    ఏది కరోనా.. ఏది సీజనల్.. తెలుసుకోండి?

    విద్యార్థులు ఇంటి నుంచి పరీక్షలు రాయడం వల్ల కరోనా బారినపడే అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. విద్యార్థులు పరీక్షలు రాశాక సమాధాన పేపర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసే సంబంధిత కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం కూడా పెద్ద సంఖ్యలో బుక్ లెట్ కలెక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. వీటితోపాటు విద్యార్థులు పోస్టు ద్వారా, ఈమెయిల్ ద్వారా కూడా సమాధాన పత్రాలను పంపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. విద్యార్థుల రిజల్ట్ అక్టోబర్ లో విడుదలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

    ప్రభుత్వం నిర్ణయం వల్ల 5.71 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్ధులకు ప్రయోజనం కలుగనుందట. ప్రస్తుత పరిస్థితులు చూస్తేంటే మధ్యప్రదేశ్ బాటలో మరికొన్ని రాష్ట్రాలు వెళ్లడం ఖాయంగా కన్పిస్తుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే చూసికూడా పరీక్షలు పాస్ కాలేని విద్యార్థుల విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!

    Tags