https://oktelugu.com/

త్రిష నా కెరీర్ నాశనం చేసింది.. నటి సంచలన ఆరోపణ

తెలుగులో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ త్రిష. సౌత్ ఇండియాలో మంచి స్టార్డమ్‌ ఉన్న నటి. తమిళ్‌, తెలుగు, కన్నడ మూవీస్‌లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వర్షంతో తెలుగుకు ప్రేక్షకులకు చేరువైన ఆమె చాన్నాళ్ల పాటు స్టార్ హీరోల సరసన నటించి టాప్‌ యాక్ట్రెస్‌గా వెలుగొందింది. కానీ, కొన్నేళ్లుగా ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది. 2016లో ‘నాయకి’ తెలుగులో ఆమె చివరి చిత్రం. ఈ మధ్య పూర్తిగా తమిళ్‌పైనే దృష్టి పెట్టిందామె. ఆమె చేతిలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 29, 2020 / 07:52 PM IST
    Follow us on


    తెలుగులో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ త్రిష. సౌత్ ఇండియాలో మంచి స్టార్డమ్‌ ఉన్న నటి. తమిళ్‌, తెలుగు, కన్నడ మూవీస్‌లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వర్షంతో తెలుగుకు ప్రేక్షకులకు చేరువైన ఆమె చాన్నాళ్ల పాటు స్టార్ హీరోల సరసన నటించి టాప్‌ యాక్ట్రెస్‌గా వెలుగొందింది. కానీ, కొన్నేళ్లుగా ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది. 2016లో ‘నాయకి’ తెలుగులో ఆమె చివరి చిత్రం. ఈ మధ్య పూర్తిగా తమిళ్‌పైనే దృష్టి పెట్టిందామె. ఆమె చేతిలో ఏకంగా ఆరు తమిళ చిత్రాలు, ఓ మలయాళ మూవీ ఉంది.

    Also Read: అరివీర భయంకర.. అధీరా!

    మరోవైపు హీరో శింబుతో ప్రేమలో ఉన్న త్రిష.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని ఈ ప్రేమ పక్షులు ఖండించలేదు. దీనిపై చర్చ నడుస్తుండగానే త్రిష మరో వివాదంలో చిక్కుతుంది. తమిళ నటి మీరా మిథున్‌ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేవలం కులం కారణంగానే త్రిషకు అవకాశాలు వస్తున్నాయని, కోలీవుడ్‌లో బంధుప్రీతితో పాటు కులపిచ్చి కూడా ఉందని విమర్శించింది. అంతేకాదు త్రిష తన కెరీర్ను నాశనం చేసిందని సంచలన ఆరోపణలు చేసింది. రజినీకాంత్‌ మూవీ ‘పేట’ నుంచి తనను బయటికి గెంటేసేలా చేసిందని ఆరోపించింది. మరెన్నో విషయాలు చెబుతూ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్‌ చేసింది మీరా.

    Also Read: పూజా హెగ్డే రెచ్చగొడుతున్నా పట్టించుకోని అఖిల్‌

    ‘నేను కింగ్‌ఫిషరర్ సూపర్ మోడల్‌ అన్న ఒకే ఒక్క కారణంతో త్రిష అభద్రతా భావానికి గురైంది. దాంతో, కోలీవుడ్‌ మాఫియాతో కుమ్మక్కై నన్ను అణగదొక్కే ప్రయత్నం చేసింది. యెన్న అరిందల్‌ మూవీలో నా సీన్స్‌ను కట్‌ చేయించింది. ఇది అక్కడితోనే ఆగిపోలేదు. ఆ మూవీ వచ్చిన ఏడేళ్ల తర్వాత కూడా నాపై త్రిష కక్ష తగ్గలేదు. పేట మూవీ నుంచి నన్ను తప్పించేలా చేసింది’ అని వీడియోలో పేర్కొంది. కోలీవుడ్‌లో కులపిచ్చి ఎక్కువైందని ఆరోపించింది.

    https://twitter.com/meera_mitun/status/1288011220134502400