https://oktelugu.com/

పీసీసీ రేసులో మధుయాష్కీ?

పీసీసీ అధ్యక్ష పదవిపై పీటముడి వీడడం లేదు. రోజుకో నాయకుడి పేరు తెరపైకి వస్తుండడంతో అసలు పదవి ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిన్నటి దాకా రేవంత్ రెడ్డి అని నేడు మధుయాష్కీగౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఎవరికి దక్కుతుందోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి పేరు రాగానే సీనియర్ నాయకుడు వీహెచ్ తీవ్ర స్థాయిలో స్పందించడంతో పార్టీలో ఏం జరుగుతుందోనని ఆసక్తి పెరుగుతోంది. రాహుల్ గాంధీకి విధేయుడిగా ఉన్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 7, 2021 / 07:01 PM IST
    Follow us on

    పీసీసీ అధ్యక్ష పదవిపై పీటముడి వీడడం లేదు. రోజుకో నాయకుడి పేరు తెరపైకి వస్తుండడంతో అసలు పదవి ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిన్నటి దాకా రేవంత్ రెడ్డి అని నేడు మధుయాష్కీగౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఎవరికి దక్కుతుందోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి పేరు రాగానే సీనియర్ నాయకుడు వీహెచ్ తీవ్ర స్థాయిలో స్పందించడంతో పార్టీలో ఏం జరుగుతుందోనని ఆసక్తి పెరుగుతోంది.

    రాహుల్ గాంధీకి విధేయుడిగా ఉన్న మధు యాష్కీ ప్రస్తుతం పీసీసీ ప్రెసిడెంట్ రేసులో ఉన్నానని ప్రకటించడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మధు యాష్కీకి రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పీసీసీ అధ్యక్ష పదవి ఎంపికలో ఏఐసీసీ నాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదురు చూస్తున్నారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీలో నానబెట్టడం బాగా అలవాటు. దీంతోనే అధ్యక్ష పదవిపై తొందరగా నిర్ణయం తీసుకోకుండా రోజుల తరబడి నాన్చుతున్నారనే విషయం అర్థమవుతోంది.

    మధు యాష్కీ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయగల సమర్థుడే. రాహుల్ గాంధీకి దగ్గరగా ఉండే నాయకుడే. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ లేకపోయినా ఆయన హవా మాత్రం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మధు యాష్కీ గౌడ్ అడిగితే రాహుల్ గాంధీ కాదనరనే ప్రచారం వినిపిస్తోంది. దీంతో పీసీసీ చీఫ్ రేసు ఆసక్తిగా కొనసాగుతోంది. ఎవరి శక్తి మేరకు వారు లాబీయింగ్ చేస్తున్నట్తు తెలుస్తోంది.

    ఈటల రాజేందర్ వ్యవహారంపై మధు యాష్కీ స్పందించారు.ఆయన ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. బీజేపీ,టీఆర్ఎస్ రెండూ ఒకటేనని తేల్చిచెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే బీజేపీమీద కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పదవుల కోసం పాకులాడే టీఆర్ఎస్ నాయకులకు భవిష్యత్తులో తగిన శాస్తి జరుగుతుందని జోస్యం చెప్పారు.