
దేశరాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజుల నుంచి మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో కొత్తకేసులు సంఖ్య గణనీయంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 231 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. తాజాగా మరో 876 మంది కోలుకున్నారు. 24 గంటల్లో కరోనా బారిన పడి 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,208 గా ఉంది. ఇప్పటి వరకు 13,99,640 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.