spot_img
Homeజాతీయ వార్తలుMadhavi Latha Delhi Airport Video: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాధవీలత దుర్గా...

Madhavi Latha Delhi Airport Video: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాధవీలత దుర్గా స్తుతి.. వీడియో వైరల్

Madhavi Latha Delhi Airport Video: 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పాతబస్తీ నుంచి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేసింది బిజెపి నేత మాధవి లత. ఒకానొక దశలో పాతబస్తీలో గెలుస్తుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే చివరికి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు.. ఓటమి పాలైనప్పటికీ మాధవి లత విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

మాధవి లత కు విరించి పేరుతో ఒక ఆసుపత్రి ఉంది. ఇది బంజారాహిల్స్ లో ఉంది.. కోవిడ్ సమయంలో ఈ ఆస్పత్రి పై అనేక రకాల విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం బ్లాక్ లిస్టులో కూడా పెట్టింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ నిషేధ జాబితా నుంచి ఈ ఆసుపత్రిని తొలగించింది. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా మాధవి లత పేరు తెరపైకి వచ్చింది. బిజెపి నుంచి ఆమె పాత బస్తి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో వినూత్నమైన విధానాన్ని కొనసాగించారు. ఒకానొక సందర్భంలో ఓవైసీ ఓటమి ఖాయమని ఆమె స్పష్టం చేశారు. పాతబస్తీలో ప్రతి ప్రాంతాన్ని ఆమె తిరిగారు. ఓటర్లను వినూత్నంగా అభ్యర్థించారు. తనకు ఓటు వేయాలని కోరారు. అయితే ఓవైసీ మాత్రం తన సంప్రదాయ ఓటు బ్యాంకు ను నమ్ముకున్నారు. ఇక్కడ ముస్లింలు అధికంగా ఉండడంతో ఆయన విజయం సాధించారు.

మాధవి లత ఆ ఓటమి తర్వాత మీడియాలో అంతగా కనిపించడం లేదు. ఇటీవల కొన్ని సందర్భాలలో తెరపైకి వచ్చినప్పటికీ.. ఆమె మునుపటి స్థాయిని మాత్రం అందుకోలేకపోయారు. అయితే ఇప్పుడు మాధవి లత పేరు మీడియాలో విపరీతంగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇటీవల ఢిల్లీలోని విమానాశ్రయంలో మహిళల గదిలోకి వెళ్లి మాధవి లత పూజలు చేశారు. పైగా ఆమె కెమెరాతో వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ముస్లిం మహిళలు నమాజ్ చదువుతుండగా.. మాధవి లత బిగ్గర గా దుర్గా స్తుతి పఠించినట్టు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది..ముస్లిం మహిళలు నిశ్శబ్దంగా నమాజ్ చదువుతుంటే.. మాధవి లత బిగ్గరగా దుర్గా స్తుతి చదివారని తెలుస్తోంది.. మాధవి లత ఇలా కావాలని చేశారని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.

బిజెపి నేతలు మాత్రం మాధవి లత చేసిన పనిని సమర్థిస్తున్నారు. ఇలానే ఆమె తన దూకుడు కొనసాగించాలని.. అప్పుడే హిందువుల ఏమిటో మిగతా వారికి తెలుస్తుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా గ్రూపులు మాధవి లత తీరును తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ముస్లింలను వెనకేసుకొస్తూ.. మాధవి లత చేసింది మొత్తం తప్పు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని కమలం నేతలు తిప్పికొడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదని.. మాధవి లత చేసిన దాంట్లో తప్పేముందని వారి ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో అటు గులాబి.. ఇటు కమలం పార్టీ కార్యకర్తల మధ్య అగ్గి రాజేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular