Lunar Eclipse : 2025 మార్చిలో మొదటి చంద్రగ్రహణం రాబోతుంది. ఈనెల 14 న చంద్రగ్రహణం ఉన్నట్లు ఖగోళ శాస్త్రం తెలుపుతుంది. అయితే ఇదే రోజు భారతదేశంలో హోలీ పండుగ ఉన్నందున చంద్రగ్రహణం పై చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. చంద్రగ్రహణం కారణంగా ఈరోజు హోలీ నిర్వహించుకోవచ్చా? లేదా అనే అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి. సాధారణంగా గ్రహణం ఏర్పడితే హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తారు. అయితే మార్చి 14న హోలీ పండుగ తో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడడంతో హోలీ పండుగ రోజు నియమాలు పాటించవచ్చా? లేదా అనేది చాలామంది సందేహంకలుగుతోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
Also Read : చంద్రగ్రహణం రోజున ఈ రాశి వారికి లక్కీ డే.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
2025 మార్చి 14న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది. అయితే ఇది భారత కాలమానం ప్రకారం ఉదయం సమయంలో జరుగుతోంది. అంటే భారత్ లో చంద్రుడు కనిపించడు. దీంతో ఇక్కడ చంద్ర గ్రహణం ఏర్పడదు. దక్షిణ అమెరికాతో పాటు పసిపిక్ మహాసముద్ర తీరాన చంద్ర గ్రహణం కనిపిస్తుంది. అలాగే జమైకా, కొలంబియా, మెక్సికో, బిరైజ్, ఫనామ, సల్విడార్, పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల భారత్ లో చంద్ర గ్రహణం ఎటువంటి ప్రభావం చూపదు. చంద్ర గ్రహణం భారత్ లో ఎటువంటి ప్రభావం చూపకపోయినందున ఇక్కడ ఎలాంటి ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు.
భారత దేశంలో13న కామదహణం, 14న హోలీ పండుగ నిర్వహించుకోనున్నారు. చంద్ర గ్రహణం రోజే హోలీ పండుగ రావడంతో ఈ వేడుకలకు దూరంగా ఉండాలా? అని చాలా మంది సందేహ పడుతున్నారు. కానీ చంద్రగ్రహణం ప్రభావం లేనందున హోలీ వేడుకలను నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇదే రోజు లక్ష్మీ జయంతి కూడా రాబోతుంది. అందువల్ల లక్ష్మీ దేవతకు కూడా పూజలు నిర్వహించుకోవచ్చని కొందరు పండితులు పేర్కొంటున్నారు.
సాధారణంగా భారత్ లో చంద్ర గ్రహణం ఏర్పడితే చాలా వరకు నియమాలు పాటిస్తారు. ఈ రోజు ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోరు. ముఖ్యంగా గర్భిణులు కదలకుండా నిద్రిస్తారు. చంద్ర గ్రహణం పూర్తయిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకుంటారు. చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో ఆలయాలు మూసివేసి.. ఆ తరువాత తెరిచి సంప్రోక్షణ చేస్తారు. అయితే మార్చి 14న ఈ కార్యక్రమం చేస్తారా? లేదా? అనేది తెలియాలి. భారత్ లో అసలు చంద్రుడు కనిపించకపోయినందున ఆ నియమాలు పటించకపోవచ్చని అంటున్నారు.
ఇక హోలీ సందర్భంగా వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రసాయన రంగులకు దూరంగా ఉండి.. సాంప్రదా రంగులతో హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా యువకుు ఈత కొలనుకు వెళ్లిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. సాధ్యమైనంత వరకు పిల్లలను అలాంటి చోటుకు వెళ్లనీయకుండా ఉంచాలని పేర్కొంటున్నారు. హోలీ వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : చంద్రగ్రహణం సందర్భంగా ప్రతికూల శక్తి పోవాలంటే.. ఈ మంత్రాన్ని పఠించాలి.. అదేంటంటే?