Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుందో మనమంతా చూసాము. ట్రైలర్ ని చూసి మినిమం గ్యారంటీ హిట్ రామ్ చరణ్ కి రాబోతుందని అనుకున్న అభిమానులకు, థియేటర్ లో భంగపాటు కలిగింది. ప్రారంభం నుండి ఎండింగ్ వరకు అసలు సినిమా కథ ఎటు వైపు వెళ్తుందో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ప్రతీ సన్నివేశానికి లింకులు మిస్ అయ్యాయి. స్క్రీన్ ప్లే హడావడిగా పరుగులు తీసింది, అద్భుతంగా ఉందని అనిపించుకున్న ఫ్లాష్ బ్యాక్ ని కేవలం 20 నిమిషాల్లో ముగించారు. హీరో కి సరైన ఎలివేషన్ సన్నివేశాలు లేవు. ఎప్పుడో 2013 కాలం నాటి సన్నివేశాలు, అభిమానులు కూడా రెండవసారి థియేటర్స్ లో చూడాలని అనుకోలేదు. ఇవన్నీ ‘గేమ్ చేంజర్’ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం అయ్యాయి.
Also Read : ‘గేమ్ చేంజర్’ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే అంటూ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్!
ఇదంతా పక్కన పెడితే ఫిబ్రవరి మొదటి వారం లో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో విడుదల చేసారు మేకర్స్. ఒక్క హిందీ లో తప్ప, మిగిలిన అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. హిందీ వెర్షన్ కోసం నార్త్ ఆడియన్స్ ఎదురు చూస్టుండగా, 5 రోజుల క్రితమే హిందీ వెర్షన్ ని జీ5 ఓటీటీ యాప్ లో విడుదల చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది. జీ5(Zee5) సంస్థ అందించిన లెక్కల ప్రకారం ఈ సినిమాకు 5 రోజులకు కలిపి 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. మార్చ్ 1 న విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం జీ5 యాప్ లో మూడవ స్థానం లో ట్రెండ్ అవుతుండగా, ‘గేమ్ చేంజర్’ చిత్రం రెండవ స్థానంలో ట్రెండ్ అవుతుంది. హిందీ లో రామ్ చరణ్ కి మంచి క్రేజ్ ఉండడం వల్లే ఈ సినిమాకు అంతటి రేంజ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.
యూట్యూబ్ లో కూడా రామ్ చరణ్ హిందీ డబ్బింగ్ సినిమాలకు 100 మిలియన్ కి తక్కువ కాకుండా వ్యూస్ వస్తుంటాయి. మగధీర సమయం నుండే రామ్ చరణ్ అక్కడి ఆడియన్స్ కి సుపరిచితుడు. అందుకే ఆయన సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ని ఇస్తుంటారు. ‘గేమ్ చేంజర్’ చిత్రం కూడా హిందీ లో థియేటర్స్ నుండి దాదాపుగా 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఒక డిజాస్టర్ సినిమాకి ఈ రేంజ్ వసూలు రావడం చిన్న విషయం కాదు. సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే కచ్చితంగా ఈ సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను హిందీ వెర్షన్ నుండి రాబట్టి ఉండేది. రామ్ చరణ్ దురదృష్టం అలా ఉందని అభిమానులు బాధ పడుతున్నారు.
Also Read : అమెజాన్ ప్రైమ్ కి ఊహించని షాక్ ఇచ్చిన దిల్ రాజు..’గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్ విడుదల అయ్యేది ఆ ఓటీటీ లోనే!