Lunar Eclipse: చంద్రగ్రహణం అనగానే ఈరోజు కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతారు. సైంటిఫిక్ ప్రకారం చంద్రగ్రహణం సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డు వస్తే ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహు కేతువులు సూర్యుడిని మింగేస్తారని అంటారు. అందువల్ల ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించాలని చెబుతారు. అలాగే ఆలయాలను మూసివేస్తారు. అయితే మార్చి 14న ఏర్పడే చంద్రగ్రహణం భారత ఎలాంటి ప్రభావం ఉండదని ఇప్పటికే తేల్చారు. కానీ ఈ చంద్రగ్రహణం రోజు నుంచి కొన్ని రాశుల వారికి మహర్దశ పట్టనుంది. ఈరోజు నా శనీశ్వరుడు రాజయోగం లోకి వెళ్ళను నాడు. అంటే తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తాడు. శనీశ్వరుడు సృష్టించే ఈ రాజయోగంతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఆ రాశులు ఎటువంటి ప్రయోజనాలు పొందుతారు చూద్దాం..
శనీశ్వరుడు సృష్టించే రాజయోగంతో మేష రాశి పై ప్రభావం పడుతుంది. మీ రాశి వారు రాజయోగం పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగుపడతారు. వ్యాపారాలు ప్రారంభిస్తే అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పొందుతుంది. కొత్తగా జీవిత భాగస్వామితో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశాలతో వ్యాపారం చేసేవారు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు ఇదే మంచి అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
శనీశ్వరుడు రాజయోగం వల్ల మిథున రాశిపై ప్రభావం పడుతుంది. మీ రాశి వారికి ఊహించని విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఎక్కువ లాభాలను పొందుతారు. కొత్త పెట్టుబడులను పెడితే వెంటనే లాభాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు పదవులు పొందుతారు. ఇన్నాళ్లు ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. సీనియర్ల సహకారంతో కొత్త లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలకు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు.
కుంభ రాశి వారిపై శనీశ్వరుని రాజయోగం ప్రభావం ఉండనుంది. శనీశ్వరుడి సొంత రాశి అయినందువల్ల ఈ రాశి వారికి అత్యధిక లాభాలు రానున్నాయి. వ్యాపారులు ఏ పని ప్రారంభించిన వెంటనే పూర్తి చేస్తారు. కొత్తగా ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణంలో సంతోషంగా ఉంటుంది. విహార యాత్రలకు వెళ్లడం వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవాలి.
పై మూడు రోజుల్లోనే కాకుండా మిగతా రాశుల్లో కూడా శని ప్రభావం ఉంటుంది. అయితే వీరి కి శనీశ్వరుని నుంచి ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే ప్రతి శనివారం శనీశ్వరుడికి నల్ల నువ్వులు తో పాటు ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే తైలంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం ఉండే ఆ రాశుల వారికి కూడా అనుకూల పవనాలు ఉండే అవకాశం ఉంది.