Deputy CM Pavan Kalyan :జగన్ ను మరింత డిఫెన్స్ లో పడేసిన పవన్ కళ్యాణ్

ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో వైసిపి పూర్తి డిఫెన్స్ లో పడింది. అయితే పవన్ చర్యలతో ఆ పార్టీ పూర్తి ఆత్మ రక్షణలో పడడం విశేషం

Written By: Dharma, Updated On : September 22, 2024 2:46 pm

Deputy CM Pavan Kalyan

Follow us on

Deputy CM Pavan Kalyan : తిరుమల లడ్డూ వివాదంలో పవన్ తీరు మరింత చర్చకు దారితీస్తోంది. జాతీయస్థాయిలో సైతం హాట్ టాపిక్ గా మారింది. స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిపారని వివాదం రేగిన సంగతి తెలిసిందే. లక్షలాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యవహారం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఆయన చేసిన ట్విట్ జాతీయ స్థాయిలో సైతం వైరల్ గా మారింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని పవన్ అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను ప్రత్యేక చట్టంతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై నేషనల్ లెవెల్ లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఈ వ్యవస్థ ఏర్పాటు అనేది ఇతర మతాలకు వ్యతిరేకం కాదని కూడా పవన్ తేల్చి చెప్పారు. మరోవైపు వైసిపి హయాంలో అడ్డగోలు వ్యవహారాలు నడిచాయని బయట పెట్టడంలో పవన్ సక్సెస్ అయ్యారు. మాజీ సీఎం జగన్ ను డిఫెన్స్ లో పెట్టారు.

తాజాగా పవన్ ప్రాయశ్చిత దీక్ష ప్రారంభించారు. 11 రోజులు పాటు ఈ దీక్ష కొనసాగించనున్నారు. చివరి రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీక్షను స్వీకరించిన సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.గత ఐదేళ్లుగా తిరుమలలో అడ్డగోలు వ్యవహారాలు నడిచాయని గుర్తు చేశారు.భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా అనేక వ్యవహారాలు వైసిపి ప్రభుత్వం నడిపిందని చెప్పుకొచ్చారు. దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు. లడ్డుప్రసాదం తయారీలో ఏదో జరుగుతోందని గతంలోనే అనుమానించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా సరే సరైన చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

శ్రీవాణి ట్రస్ట్ పేరిట కోట్లాది రూపాయల గోల్మాల్ జరిగిందని పవన్ గుర్తు చేశారు.చివరకు శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతు కొవ్వు వాడారని బయటపడడం దురదృష్టకరమన్నారు. తిరుమలలో ఇంత జరుగుతుంటే చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి,కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరిట పదివేల రూపాయలు వసూలు చేసి.. 500 రూపాయల రసీదు రాసిన విషయాన్ని ప్రస్తావించారు. మిగతా సొమ్ము ఎటు పోయిందని నిలదీశారు. ఇంత జరిగినా జగన్ అడ్డగోలుగా సమర్ధించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. సనాతన ధర్మ పరిరక్షణ పై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు.

అయితే ఈ వివాదం లో జగన్ ను పూర్తి డిఫెన్స్ లో పడేశారు పవన్. జగన్ హయాంలో వైఫల్యాలను గుర్తు చేస్తూనే.. జాతీయ స్థాయిలో చర్చ జరిగే లా సనాతన ధర్మ పరిరక్షణ కోసం గళం ఎత్తారు. ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్షతో మరింత చర్చ జరిగేలా చూశారు. దీంతో వైసిపి ఆత్మ రక్షణలో పడింది.