Low investment high profit business : ఈ క్రమంలో మార్కెట్లో ఎన్నో బిజినెస్ ఐడియాలు అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర కూర్చొని లక్షలలో ఆదాయం పొందే వ్యాపారాలు కూడా చాలానే ఉన్నాయి. కొంతమంది ఎక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది సరిపడా పెట్టుబడి పెట్టలేరు. ఇటువంటి వారి కోసం ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యాపారం చాలా మంచి ఎంపిక అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ పెట్టుబడితో బాగా డిమాండ్ ఉన్న వ్యాపారాలలో అగర్బత్తి తయారీ వ్యాపారం కూడా ఒకటి. ఇంటి నుంచి కూడా అగర్బత్తి తయారీ వ్యాపారాన్ని చిన్న పెట్టుబడితో మొదలు పెట్టవచ్చు. ఈ వ్యాపారం కోసం ఒక చిన్న గది లేదా చిన్న స్థలం వంటి గ్యారేజ్ ఉన్నా కూడా మీరు హాయిగా చేసుకోవచ్చు. ఈ వ్యాపారానికి వెదురు కర్రలు, సువాసన నూనెలు, బొగ్గు, ప్యాకింగ్ మెటీరియల్స్ వంటివి అవసరం అవుతాయి. ఇవి మీకు హోల్సేల్ మార్కెట్లో చాలా తక్కువ ఖర్చులోనే దొరుకుతాయి.
కొన్ని బేసిక్ టూల్స్ ఉపయోగించి మీరు చేతితో అగర్బత్తి తయారీ ప్రారంభించవచ్చు. తర్వాత క్రమక్రమంగా వచ్చిన సంపాదనతో మీరు ఒక మిషిన్ కూడా కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో అగర్బత్తి తయారీ వ్యాపారం చేయవచ్చు. ప్రతి సీజన్లో కూడా మార్కెట్లో అగర్బత్తులకు చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం చాలామంది అగర్బత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇళ్లలో సువాసన కోసం కూడా ప్రతిరోజు వీటిని ఉపయోగిస్తారు. వినాయక చవితి, దీపావళి, రాఖి వంటి పండుగ సమయంలో వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. మన దేశ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మన దేశ అగర్బత్తులకు బాగా డిమాండ్ ఉంది.
అగర్బత్తిలో మన దేశం నుంచి 90 కి పైగా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం మీరు రూ.40,000 నుంచి రూ.80 వేల మధ్యలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. నెలకు మీరు రూ.1.5 లక్షల వరకు అమ్మకాలు సులభంగా జరుగుతాయి. ఈజీగా ప్రతినెలా రూ.50,000 లాభం పొందవచ్చు. మీరు వ్యాపారం ప్రారంభించిన తర్వాత క్రమక్రమంగా బల్క ఆర్డర్లు, ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్, విదేశీ మార్కెట్లను కూడా దృష్టిలో పెట్టుకొని లక్షలలో ఆదాయం సంపాదించుకోవచ్చు.
Also Read : అద్భుతమైన పథకం.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కేవలం 5 ఏళ్లలో రూ.22 లక్షలు మీ సొంతం..