Investment-5-years : ఈ స్కీము కాలవ్యవధి 5 ఏళ్ళు. ఈ పథకం ప్రతి త్రైమాసికంలో ఒకసారి సమీక్షించబడుతుంది. గత ఎనిమిది ఏళ్ల నుంచి స్టాక్ మార్కెట్లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఈ క్రమంలో పెట్టుబడి పెట్టాలని భావించే వాళ్ళు చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఆందోళన చెందుతున్నారు. వాళ్లు వాళ్ల డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉండే పెట్టుబడి మార్గాలను అనుసరిస్తున్నారు. దీనికోసం మీకు ప్రభుత్వం అందిస్తున్న జాతీయ పొదుపు ధ్రువీకరణ పత్రం ఒక బెస్ట్ ఆప్షన్. ప్రభుత్వ హామీతో ఉన్న ఈ పథకంలో మీరు కొన్ని లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కేవలం 5000 సమయంలో మీరు రూ.22 లక్షల రాబడి తీసుకోవచ్చు. దేశంలో ఉన్న ప్రతి పోస్ట్ ఆఫీస్ లో కూడా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతాను మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే మీరు ఈ ఖాతాను కనీసం వెయ్యి రూపాయలతో తెరవవచ్చు. దీని కాలవ్యవధి అయిదు సంవత్సరాలుగా చెప్తున్నారు. ప్రతి ఏడాదికి పోస్ట్ ఆఫీస్ లో ఉన్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో మీకు 7.7% వడ్డీ రేటును అందిస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న సెక్షన్ 80c కింద మీరు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
ఈ పథకంలో మీకు ఎటువంటి గరిష్ట పరిమితి ఇవ్వలేదు. కానీ పాత పన్ను విధానంలో ఉన్న నిబంధనల ప్రకారం ఈ పథకంలో మీకు రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి మాత్రమే ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న సెక్షన్ 80c కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో మీకు వచ్చే వడ్డీ పై ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం అనే శీర్షిక ఆధారంగా పన్నును లెక్కిస్తారు. ఈ పథకంలో మీరు పన్ను ఆదా అనే ద్వంద్వ ప్రయోజనంతో రాబడి పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ పథకంలో మీరు ఐదేళ్ల కాలానికి 7.7% వార్షిక చక్రవడ్డీని పొందవచ్చు.
ఒకవేళ మీరు 5 ఏళ్ల తర్వాత కూడా పెట్టుబడినే కొనసాగించాలని అనుకుంటున్నట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్ వారు కొత్త సర్టిఫికెట్ను జారీ చేస్తారు. మీరు ఈ పథకంలో కనీసం వంద రూపాయల నుంచి మొదలుపెట్టి ఎంతైనా సరే పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలాగే ఈ పథకంలో మీరు ఒకేసారి రూ.15 లక్షలు కూడా పెట్టుబడి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ పథకంలో రూ.15 లక్షలు 7.7% వార్షిక వడ్డీ రేటు ప్రకారం ఐదేళ్లపాటు కొనసాగించినట్లయితే మీరు మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.21,73,551 పొందవచ్చు.