Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కఃశిక్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. కమలాపురం పోలీసుస్టేషన్ లో నమోదైన కేసును కొట్టేయాలంటూ కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 188 సెక్షన్ కొట్టేసింది. పోలీసులు నమోదు చేసిన మిగతా సెక్షన్ల లో విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తనను గెలిపించకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.