Nara Lokesh: సీరియస్ గా సాగే వ్యవహారంలో సంబంధం లేని మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది? వెంటనే నవ్వొస్తుంది. యువగళం పేరుతో నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో కూడా ఇలాంటి ఎపిసోడ్లు బోలెడు. పాదయాత్రలో భాగంగా అక్కడక్కడ నిర్వహించే సమావేశాల్లో లోకేష్ చేస్తున్న ప్రసంగాలు నవ్వు తెప్పిస్తున్నాయి. అసలే ఆయన తెలుగు అంతంత మాత్రం. మాట్లాడే విషయంలో స్పష్టత ఉండదు. కొన్ని కొన్ని పదాలను ఎక్కడ వాడాలో తెలియక పోవడం ఆయనకున్న పెద్ద మైనస్ పాయింట్. ఏదో చెప్తారని జనం వస్తే .. తలా తోక లేకుండా మాట్లాడి అభాసు పాలవడం లోకేష్ కే చెల్లింది.
వాస్తవానికి విదేశాల్లో చదువుకున్న నారా లోకేష్ కు తెలుగు భాష మీద పట్టు చాలా తక్కువ. పైగా మాట్లాడే భాషలో కూడా స్పష్టత తక్కువ ఉంటుంది. దీనివల్ల ఎదుటివారికి ఏమీ అర్థం కాదు. దీనివల్ల అసలు విషయం పక్కకు వెళుతుంది. సీరియస్ గా సాగే వ్యవహారంలో కామెడీ పుడుతుంది.. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు పలు సభలు సమావేశాలను ఇదే తీరుగా మాట్లాడడంతో నవ్వుల పాలయ్యారు. సోషల్ మీడియా ప్రబలంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో లోకేష్ మాట్లాడిన మాటలు మీమర్స్ కు చేతినిండా పని కల్పించాయి. అంతేకాదు చూసే వాళ్లకు డబ్బులు పంచాయి. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో లోకేష్ ప్రచారం చేస్తున్నప్పుడు.. “ఈ దేశంలో అత్యంత అవినీతిమయమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం” అని అప్పట్లో ఆయన నోటి నుంచి జాలువారిన ఆణిముత్యం ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నో జాతి రత్నాలు ఆయన నోటి నుంచి జాలువారాయి.
తాజాగా యువ గళం పేరుతో ఆయన చేస్తున్న యాత్రలోనూ ఇదేవిధంగా కామెడీ పంచుతున్నారు. సీరియస్ గా సాగే వ్యవహారాలను అనుకోని స్పీడ్ బ్రేకర్ లాంటి మాటలు పక్కదారి పట్టిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వార్నింగ్ నవ్వు తెప్పించింది. తాను రాసుకొచ్చిన ఒక స్లిప్ చూసి జగన్ మోహన్ రెడ్డికి వార్నింగ్లు ఇచ్చిన లోకేష్.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించారు. చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడంతో జనాలు నవ్వుకున్నారు.”జగన్ కు భయాన్ని పరిచయం చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. జగన్ సభకు ప్రజలు వెళ్లకుండా లోకేష్ సభకు ప్రజలు నిల్చోలేని పరిస్థితి ప్రజలు తీసుకొచ్చారు” అని లోకేష్ అనడంతో జనం విరగబడి నవ్వారు. అయినా ఒక రాజకీయ నాయకుడు స్థానిక భాష మీద పట్టు పెంచుకున్నప్పుడు ఇక స్థానిక ప్రజలను ఎలా పరిపాలిస్తాడు? వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? ఈ విషయం లోకేష్ బాబుకు ఎప్పుడు అర్థమవుతుందో?
భయానికే భయం పుట్టించే పప్పు వార్నింగ్ కామెడీ pic.twitter.com/2J9YGvCQk8
— Political Punch (@PoliticalPunch9) June 29, 2023