KTR Assets: ‘మాటలు నేర్చినోడు ఎక్కడైనా బతుకుతాడు.. తెలంగాణలో ఇది ఓ సామెత. పని చేయకుండా తప్పించుకు తిరిగేవాడిని ఉద్దేశించి ఈ సమెత వాడతారు. అయితే ఈ సామెత కాస్త మారిస్తే కేసీఆర్ కుటుంబానికి అచ్చంగా సరిపోతుంది. మాటలతో మెస్మరైజ్ చేయడం కేసీఆర్‌తోపాటు ఆయన కడుపున పుట్టిన కేటీఆర్, కవిత కూడా నేర్చుకున్నారు. విత్తోటి పెడితే చెట్టోటి మొలుస్తుందా అన్నట్లు.. మాటలతో మెప్పించే నాన్న వారసత్వాన్ని పిల్లలూ కొనసాగిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి, తమ కుటుంబా పాలన గురించి మాదే కరెక్ట్ అని మెప్పిస్తున్నారు. ప్రతిపక్షాలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి కూడా తామేం తప్పు చేయలేదని ఒప్పిస్తున్నారు. ఆస్తుల పెరుగుదల విషయంలోనూ తమ మాటకారితనంలో అన్నాచెల్లెలు మీడియా ప్రశ్నల నుంచి తప్పించుకుంటున్నారు.
ఆరు రెట్టు ఎట్లా పెరిగాయంటే..
టీవీ9 నంబర్ వన్ స్థానం కోసం పడరాని పాట్లు పడుతోంది. ఇందు కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలో సందర్భం ఏమీ లేకపోయినా ఇటీవల కేటీఆర్‌ను స్టూడియోకు పిలిపించుకుంది. రేటింగ్స్ పెంచుకునే ప్రయత్నంలో ఇదీ ఒక భాగంగానే కనిపించింది. అదలా ఉంచితే.. ఈ ఇంటర్వ్యూలో న్యూస్ రీడర్ రజినీకాంత్ ఫ్రెండ్ నరేశ్ కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా ఓ ప్రశ్న అడిగాడు. ప్రముఖ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్న అతను.. కేటీఆర్ అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల గురించి అడిగాడు. 2014 అఫిడవిట్‌లో రూ.7 కోట్లు ఉన్న కేటీఆర్ ఆస్తి తొమ్మిదేళ్లలో ఆరు రెట్లు అంటే.. రూ.41 కోట్లకు పెరిగిందని, ఆ సీక్రెట్ చెబితే తాను కూడా హెచ్‌ఆర్ ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వస్తానన్నాడు.
మాటలతో దాటేసిన కేటీఆర్..
నరేశ్ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా.. ముక్కు ఎక్కడుందిరా అంటే తల చుట్టూ చేయి తిప్ప చూపినట్లుగా కేటీఆర్ తన ఆస్తులతోపాటు అప్పులు పెరిగాయన్నాడు. ఆస్తులు రూ.41 కోట్లు అయితే.. అప్పులు రూ.27 కోట్లట. అయినా మూడు రెట్లు పెరిగినట్లే.. నెలకు రూ.5 లక్షల వేతనం తీసుకునే కేటీఆర్ ఆదాయం ఏడాదికి రూ.60 లక్షలు.. రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చింది వచ్చినట్లు దాచిపెట్టినా.. రూ.6 కోట్లు అవుతుంది. లెక్క సరిపోయేలా అప్పులు తన ఆస్తులు ఉన్నట్లు సమాధానం చెప్పారు. మరి రూపాయి ఖర్చు పెట్టకుండా ఉంటారా.. మరి.
సున్నాలు వేసుకునేవారు.. బంగళాల్లో..
అంతటితో ఆగకుండా సున్నాలు వేసుకునేవారు జూబ్లీహిల్స్‌లో బంగళాలు కొంటున్నారని, మంత్రిగా ఉన్న నేను సంపాదించకూడదా అని ఎదురు ప్రశ్నించారు. తాను హార్డ్‌వేర్‌గానే రూ.5 లక్షల జీతం తీసుకున్నట్లుచెప్పారు. కానీ 15 ఏళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఎంత పెద్ద కంపెనీలో అయినా అంత లేవు. కానీ మాటలతో మెస్మరైజ్ చేసిన కేటీఆర్ ఆస్తుల పెంపుకు సమాధానం చెప్పకుండా ఇతర మాటలతో అసలు విషయం దాటవేశారు.