spot_img
Homeజాతీయ వార్తలుLok Sabha Polls: మరో రెండు స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన.. ఆ ఇద్దరు ఎవరంటే..

Lok Sabha Polls: మరో రెండు స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన.. ఆ ఇద్దరు ఎవరంటే..

Lok Sabha Polls: పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే 15 మంది అభ్యర్థులను ప్రకటించి అందరికంటే ముందు వరుసలో ఉంది. తర్వాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 11 మందిని ప్రకటించిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ తాజాగా మరో రెండు స్థానాలకు అబ్యర్థులను ప్రకటించారు.

నాగర్‌ కర్నూల్, మెదక్‌..
తాజాగా ప్రకటించిన రెండు స్థానాలు నాగర్‌కర్నూల్‌(ఎస్సీ), మెదక్‌ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. నాగర్‌ కర్నూల్‌ నుంచి బీఎస్పీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌కు టికెట్‌ ఇచ్చారు. మెదక్‌ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ప్రనకటించారు. ప్రవీణ్‌కుమార్‌ ఇటీవలే బీఎస్సీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. వెంకట్రామిరెడ్డి మూడేళ్ల క్రితం కలెక్టర్‌గా రిటైర్‌ అయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

పోటీకి చాలా మంది దూరం..
బీఆర్‌ఎస్‌ నేతలు చాలా మంది ఆ పార్టీ టికెట్‌పై పోటీకి నిరాకరిస్తున్నారు. ఈక్రమంలోనే సిట్టింగ్‌ ఎంపీలు వెంకటేశ్‌నేత, రాములు, బీబీపాటిల్‌ బీజేపీలో చేరారు. ఇక వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్, చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే క్యాడర్‌ అభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ టికెట్‌ అడిగేవారు లేకపోవడంతో ఎంపిక చేసిన అభ్యర్థులకు కూడా అసమ్మతి బాధ లేదు.

మొదటి జాబితాలో వీళ్లు
బీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో ఖమ్మం నామానాగేశ్వర్‌రావు. మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత, మహబూబ్‌నగర్‌ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించారు. తర్వాత రెండో జాబితాలో చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్, నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, జహీరాబాద్‌ నుంచి గాలి అనిల్‌కుమార్, వరంగల్‌ నుంచి కడియం కావ్యను ప్రకటించారు. తర్వాత మూడో జాబితాలో ఆదిలాబాద్‌ అభ్యర్థిగా ఆత్రం సక్కు, మల్కాజిగిరి నుంచి లక్ష్మారెడ్డి పోటీ చేస్తారని కేసీఆర్‌ ప్రకటించారు. తాజాగా మెదక్‌ సీటు వెంకట్రామిరెడ్డికి, నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌కు ఇచ్చారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version