Lok Sabha Election Results 2024: దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి బలం పెరిగింది. ఇదే సమయంలో అధికార ఎన్డీఏ కూటమి బలం తగ్గింది. కాదు.. బీజేపీ బలం తగ్గింది. 2019లో బీజేపీ ఒంటరిగా 303 స్థానాలు గెలుచుకుంది. కానీ, ఇప్పుడు 244 స్థానాలకే పరిమితమైంది. చార్ సౌ పార్ నినాదం పనిచేయలేదు. అయోధ్య మంత్రం ఫలితం ఇవ్వలేదు. అయితే ఈ పరిస్థితిని మోదీ ముందే ఊహించారని నిపుణులు అంటున్నారు.
కొత్త దోస్తానీ అందుకే..
మోదీ 2019లో అభివృద్ధి నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. దీంతో ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. కానీ, 2024లో హిందుత్వ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గెలిచినా.. ఓడినా హిందుత్వ ఎజెండా ఎంచుకున్నారు. అయితే ఈ ఎజెండాతో మైనారిటీ ఓటర్లు దూరమవుతారని ముందే ఊహించారు మోదీ. అందుకే ఆయన ఎన్నికలకు ముందే.. కొత్త దోస్తానీ మొదలు పెట్టారు. స
ఏపీలో టీడీపీ, కర్ణాకలో జేడీఎస్..
ఇండియా కూటమి బలం పుంజుకోవడం, హిందుత్వ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఫలితాలు అటూ ఇటూ అవుతాయని మోదీ భావించారు. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ బీజేపీకి స్కోప్ ఉండడంతో ఒంటరిగా పోటీ చేయడం కన్నా.. పొత్తుగా పోటీ చేయాలని భావించారు. దీంతో జేడీఎస్‌ను కలుపుకున్నారు.
సత్ఫలితాలు..
మోదీ చేసిన ప్రయోగం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఫలించాయి. ఏపీలో బీజేపీ ఒంటరిగా 3 లోక్‌సభ స్థానాలు గెలుచుకోగా, టీడీపీ 16 స్థానాలతో కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జనసేనకు 2 స్థానాలు వచ్చాయి. దీంతో 21 స్థానాలు ఇక్కడ ఎన్‌డీఏకు తోడయ్యాయి. ఇక కర్ణాటకలో కూడా మంచి ఫలితాలు సాధించింది. ఇక్కడ జేడీఎస్ 2 స్థానాల్లో విజయం సాధించగా, ఇక జేడీఎస్‌కు బలమున్న ఏడు స్థానాలో ఆరు బీజేపీగెలిచింది. ఇక బీజేపీ ఒంటరిగా నాలుగు స్థానాలు గెలిచింది. మొత్తంగా ఇక్కడ కూటమిగా 12 స్థానాలు దక్కించుకుంది.
మొత్తంగా మోదీ, షా ద్వయం వేసిన అంచనాలు నిజమయ్యాయి. కొత్త పొత్తులు కలిసి వచ్చాయి. ఇదే మోదీ మ్యాజిక్.