బార్లు ఓకే.. పబ్బులు నాట్..!అన్ లాక్ 3.0

కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లను ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రజా కార్యక్రమాలకు స్వేచ్ఛను ఇవ్వగా.. తాజాగా కర్ణాటక రాష్ట్రం రెండు జిల్లాల మినహా మిగతా జిల్లాలో ఆన్ లాక్ 3.0 ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దాదాపు రెండున్నర నెలల పాటు నిర్బంధంగా ఉన్న ప్రజలు ప్రభుత్వ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు. కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో కర్ణాటకలో రాష్ట్రంలో మే 10న లాక్డౌన్ […]

Written By: NARESH, Updated On : July 5, 2021 11:05 am
Follow us on

కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లను ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రజా కార్యక్రమాలకు స్వేచ్ఛను ఇవ్వగా.. తాజాగా కర్ణాటక రాష్ట్రం రెండు జిల్లాల మినహా మిగతా జిల్లాలో ఆన్ లాక్ 3.0 ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దాదాపు రెండున్నర నెలల పాటు నిర్బంధంగా ఉన్న ప్రజలు ప్రభుత్వ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు.

కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో కర్ణాటకలో రాష్ట్రంలో మే 10న లాక్డౌన్ విధించారు. సోమవారం ఉదయం నుంచి ఆన్ లాక్ 3.0 ప్రకటించడంతో అన్ని వ్యాపార లావాదేవీలు ఊపందుకున్నాయి. ప్రజా రవాణా ప్రారంభమైంది. సినిమా హాళ్లు, బార్లు తెరుచుకున్నాయి. దేవలయాలు తలుపులు తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సిబ్బంది పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే హాసన్, కొడుగు జిల్లాల్లో మాత్రం లాక్డౌన్ కొనసాగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా దెబ్బతో వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. అయితే సోమవారం నుంచి ఐటీ హబ్ నుంచి రాష్ట్రంలో అన్ని రకాల వ్యాపార లావాదేవీలు ఊపందుకోనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని వ్యాపారాలను నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించడంతో వాపారస్తలకు స్వేచ్చ దొరికినట్లయింది.

మరోవైపు మందు బాబులకు కూడా ప్రభత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లే. బార్లు, రెస్టారెంట్లు యధావిధిగా నడిపించుకోవచ్చని తెలిపింది. అయితే పబ్ లకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. లిక్కర్ షాపులతో పాటు బార్లల్లో మాత్రమే మద్యం సేవించే అవకాశం ఇచ్చింది. అలాగే ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు కూడా తమ విధులను నిర్వహించుకోవచ్చని తెలిపింది.