కరోనా వ్యాక్సిన్ ఒక డోస్ సరిపోతుందా.. వైద్యులేం చెప్పారంటే..?

మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్తకొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు కరోనా వైరస్ పేరు చెబితే తీవ్ర భయందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచ దేశాల్లో కొన్ని వేల కరోనా వేరియంట్లు ఉండగా కొన్ని వేరియంట్లు అత్యంత ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. వ్యాక్సినేషన్ ద్వారా మాత్రమే కరోనా వేరియంట్ల నుంచి రక్షణ పొందడం సాధ్యమవుతుంది. వ్యాక్సిన్ కొరత వల్ల ప్రపంచ దేశాల్లో అనుకున్న […]

Written By: Kusuma Aggunna, Updated On : July 5, 2021 11:05 am
Follow us on

మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్తకొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు కరోనా వైరస్ పేరు చెబితే తీవ్ర భయందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచ దేశాల్లో కొన్ని వేల కరోనా వేరియంట్లు ఉండగా కొన్ని వేరియంట్లు అత్యంత ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. వ్యాక్సినేషన్ ద్వారా మాత్రమే కరోనా వేరియంట్ల నుంచి రక్షణ పొందడం సాధ్యమవుతుంది.

వ్యాక్సిన్ కొరత వల్ల ప్రపంచ దేశాల్లో అనుకున్న స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగడం లేదు. భారత్ లో కూడా వ్యాక్సిన్ కొరత ఉంది. వ్యాక్సిన్ కొరత వల్లే సెకండ్ డోస్ ను ఆలస్యంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకున్న వాళ్లు రెండో డోస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక్క డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ఆ వ్యాక్సిన్ కొత్త వేరియంట్లపై ప్రభావం పెద్దగా చూపదని చెబుతోంది.

వైద్యులు సైతం కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. సింగిల్ వ్యాక్సిన్ డోస్ కొత్త వేరియంట్లపై పెద్దగా ప్రభావం చూపదని గడువు లోపు సెకండ్ డోస్ తీసుకోని పక్షంలో కొత్త వేరియంట్లను అడ్డుకోవడం అంత తేలిక కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వైరస్ మ్యుటేషన్ ఇదే విధంగా కొనసాగితే వ్యాక్సిన్లు కూడా పని చేయకపోవచ్చని అలాంటి పరిస్థితులు రావడానికి ముందే వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

సరైన సమయంలో రెండో డోసు కూడా తీసుకుంటే మంచిదని వ్యాక్సిన్ ఎక్కువమంది తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లేదంటే మాత్రం కొత్త వేరియంట్లను అడ్డుకోవడం కష్టమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చినా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.