https://oktelugu.com/

ఆగకుండా వెక్కిళ్లు వస్తున్నాయా.. చెక్ పెట్టే చిట్కాలు ఇవే..?

మనలో చాలామందిని ఎక్కిళ్ల సమస్య ఏదో ఒక సందర్భంలో వేధిస్తూ ఉంటుంది. సాధారణంగా ఎక్కిళ్లు వస్తే నిమిషాల వ్యవధిలోనే తగ్గిపోవడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఎక్కిళ్లు వెంటనే తగ్గవు. నీళ్లు తాగినా కూడా ఎక్కిళ్ల సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడేవాళ్లను దృష్టిలో ఉంచుకుని టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం సహాయంతో ఎక్కిళ్లను సులభంగా తగ్గించడం సాధ్యమవుతుంది. సాధారణంగా ఫ్రెనిక్‌, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 5, 2021 / 11:10 AM IST
    Follow us on

    మనలో చాలామందిని ఎక్కిళ్ల సమస్య ఏదో ఒక సందర్భంలో వేధిస్తూ ఉంటుంది. సాధారణంగా ఎక్కిళ్లు వస్తే నిమిషాల వ్యవధిలోనే తగ్గిపోవడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఎక్కిళ్లు వెంటనే తగ్గవు. నీళ్లు తాగినా కూడా ఎక్కిళ్ల సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడేవాళ్లను దృష్టిలో ఉంచుకుని టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేశారు.

    ఈ పరికరం సహాయంతో ఎక్కిళ్లను సులభంగా తగ్గించడం సాధ్యమవుతుంది. సాధారణంగా ఫ్రెనిక్‌, వేగ‌స్ నాడులు బిగుసుకుపోతే డ‌యాఫ్ర‌మ్ కండ‌రం సంకోచించి స్వరపేటికపై ఉండే ఎపిగ్లాసిటిస్ మూసుకుపోవడం జరుగుతుంది. ఆ సమయంలో లోపలి నుంచి వచ్చే గాలి స్వరపేటికకు తగిలి హిక్ అనే శబ్దంతో ఎక్కిళ్లు వస్తాయి. టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎక్కిళ్లను తగ్గించడానికి ఎల్ ఆకారంలో ఉండే ఒక స్ట్రాను వినియోగిస్తారు.

    ఈ స్ట్రాకు ఫోర్స్‌డ్ ఇన్‌స్పిరేట‌రీ స‌క్ష‌న్ అండ్ స్వాలో టూల్ అనే పేరును పెట్టారు. ట్యూబ్ లా ఉండే ఈ స్ట్రా అడుగున రెండు వేర్వేరు సైజుల్లో రంధ్రాలు ఉంటాయి. పిల్లల కొరకు అయితే చిన్న రంధ్రం పెద్దల కొరకు అయితే పెద్ద రంధ్రంను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత స్ట్రాను నీటితో ఉన్న గ్లాసులో ఉంచితే ఎక్కిళ్లు ఆగిపోతాయి. స్ట్రా లాంటి పరికరం ద్వారా నీటిని పీల్చడం ద్వారా ఎక్కిళ్ల‌కు కార‌ణ‌మైన ఫ్రెనిక్‌, వేగ‌స్ నాడులు స్పందించి డయాఫ్రమ్ యథాస్థితికి వస్తుంది.

    ఆ తరువాత ఎపిగ్లాటిస్ తెరుచుకుని గాలి మార్గం సులువై ఎక్కిళ్లు ఆగిపోతాయి. ఈ స్ట్రాను ఉపయోగించిన వాళ్లలో 92 శాతం మందికి సులువుగా ఎక్కిళ్లు తగ్గాయి. అల్లం ముక్కను నోట్లో వేసుకోవడం, యాలకుల పొడిని నీటిలో మరగించి తాగడం, పెరుగులో ఉప్పు వేసుకుని కలుపుకొని తినడం, అరచెంచా ఆవాలు, అరచెంచా నెయ్యి మిశ్రమాన్ని గొంతులో వేసుకుని మింగడం, చక్కెర లేదా తేనె చప్పరించడం ద్వారా ఎక్కిళ్లకు చెక్ పెట్టవచ్చు.