పాతబస్తీలో అల్లరి మూకలదే రాజ్యం.. !!

ఎంతో శక్తివంతమైన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ లోని పాతబస్తీ అంటేనే వణికి పోతున్నది. అక్కడ కరోనా వైరస్ కట్టడికి అధికారులు దాదాపు చేతులు ఎత్తివేస్తూ ఉండడంతో దిక్కుతోచడం లేదు. మొత్తం తెలంగాణలోని కరోనా కేసులలో సగం హైదరాబాద్ కు చెందినవే కాగా, వాటిల్లో సగంకు పైగా పాతబస్తీవే. పలు ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా ప్రకటించినా ఎవ్వరు లెక్క చేయడం లేదు. అనుమానితులు వైద్య పరీక్షలకు ముఖం చాటేయడం, వైరస్ సోకినా వారు కూడా పోలీసులను […]

Written By: Neelambaram, Updated On : April 26, 2020 5:26 pm
Follow us on


ఎంతో శక్తివంతమైన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ లోని పాతబస్తీ అంటేనే వణికి పోతున్నది. అక్కడ కరోనా వైరస్ కట్టడికి అధికారులు దాదాపు చేతులు ఎత్తివేస్తూ ఉండడంతో దిక్కుతోచడం లేదు.

మొత్తం తెలంగాణలోని కరోనా కేసులలో సగం హైదరాబాద్ కు చెందినవే కాగా, వాటిల్లో సగంకు పైగా పాతబస్తీవే. పలు ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా ప్రకటించినా ఎవ్వరు లెక్క చేయడం లేదు.

అనుమానితులు వైద్య పరీక్షలకు ముఖం చాటేయడం, వైరస్ సోకినా వారు కూడా పోలీసులను సహితం లెక్క చేయకుండా ద్విచక్ర వాహనాలపై రోడ్లపైకి వచ్చి హల్ చల్ చేస్తుండడంతో పోలీసులు సహితం ప్రేక్షక పాత్ర వహించవలసి వస్తున్నది. వారిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే వారిపైననే అల్లరి మూకలు ఎదురు తిరుగుతున్నారు.

ఇక్కడ యధేచ్చగా తిరుగుతున్న అల్లరి ముఖాలకు రాజకీయ ప్రాపకం ఉండడంతో అధికారులు, అధికార పక్షానికి చెందిన వారు సైతం ఒక గీత దాటి ముందుకు వెళ్లలేక పోతున్నారు. బయటకు రావద్దని హెచ్చరిస్తున్న పోలీసులపై కొంతమంది పోకిరీలు జులం చేస్తున్నారు.

ఇప్పటి వరకు నగరంలో 480 వరకు కేసులు నమోదుగా అత్యధిక కేసులు పాతబస్తీ ప్రాంతాలకు చెందినవే. జీహెచ్‌ఎంసీ, పోలీసు, వైద్యశాఖ అధికారులు కంటైన్‌మెంట్ జోన్లలో నివసించే ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా, ఇతరులకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించాలని ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు.

రేషన్‌బియ్యం, నగదు రూ.1500లు, జన్‌ధన్ ఖాతా డబ్బులు, నిత్యావసర సరుకుల పేరుతో సామాజిక దూరంగా పాటించకుండా గుంపులు గుంపులుగా ఒకే దగ్గర చేరుతున్నారు. ఈవిధంగా చేస్తుంటే కరోనా వైరస్ మిగతా వారికి వస్తుందని స్థానిక అధికారులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. పైగా ఆ విధంగా వారించినా అధికారులపైనే తిరుగుబాటు చేస్తున్నారు.

బేగంబజార్ ప్రాంతంలో ఉదయం 8గంటల తరువాత ఖర్జురా గల్లీకి పెద్ద ఎత్తున వస్తూ మధ్యాహ్నం 12గంటల వరకు అక్కడే తిష్టవేస్తూ సరుకుల కొనుగోలు చేస్తున్నామంటూ కనీసం మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా దుకాణాల ముందు హంగామా చేస్తున్నారు.

మర్కజ్ వెళ్లిన వారిలో 420 మంది వరకు ఈ ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. చార్మినార్ యునానీ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు అందిస్తున్నప్పటికీ వైద్య పరీక్షలకు ముందుకు రావడం లేదు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా స్థానికులు ఆసుపత్రికి రాకుండా చుట్టుపక్కల వారిని భయాందోళనలకు గురిచేస్తున్నట్లు పోలీసులు కూడా అంగీకరిస్తున్నారు.

తాము వెళ్లి బలవంతంగా తీసుకొస్తే తప్ప ఎవరు వైద్యపరీక్షలకు ముందుకు రావడం లేదని, తక్కువ సంఖ్యలో ప్రభుత్వం సిబ్బంది వెళ్లితే బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీస్ అధికారులు వాపోతున్నారు.