ఎస్.ఈ.సి పిటీషన్ కొట్టివేయండి..!

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తన తొలగింపుపై దాఖలు చేసిన పిటీషన్ కొట్టేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ లో పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదాకు సంబంధించి నోట్ పైలు సిద్ధం చేయలేదని, కార్యాలయ అధికారులతో గానీ సంప్రదించలేదని ఎన్నికల సంఘం కార్యదర్శి ఎస్.రామసుందర రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిర్ణయాలు అన్ని పూర్తిగా వ్యక్తి గత నిర్ణయాల వాలే తీసుకున్నారని, ఈ నిర్ణయాలు తీసుకునే ముందు పాటించాల్సిన విధి […]

Written By: Neelambaram, Updated On : April 26, 2020 12:10 pm
Follow us on


రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తన తొలగింపుపై దాఖలు చేసిన పిటీషన్ కొట్టేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ లో పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదాకు సంబంధించి నోట్ పైలు సిద్ధం చేయలేదని, కార్యాలయ అధికారులతో గానీ సంప్రదించలేదని ఎన్నికల సంఘం కార్యదర్శి ఎస్.రామసుందర రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిర్ణయాలు అన్ని పూర్తిగా వ్యక్తి గత నిర్ణయాల వాలే తీసుకున్నారని, ఈ నిర్ణయాలు తీసుకునే ముందు పాటించాల్సిన విధి విధానాన్ని పక్కన పెట్టేశారని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఏ పైలు కార్యాలయ నిబంధనల ప్రకారం నడవలేదని స్పష్టం చేశారు. మార్చి 18 నుంచి హైదరాబాద్ లోనే ఉంటూ తొలగింపు జరిగే వరకూ కార్యాలయానికి రాలేదని పేర్కొన్నారు. ఇతర పలు అంశాలను వెల్లడిస్తూ… ఎస్.ఈ.సి పిటీషన్ కోటీయాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు.

మరోవైపు ఈ అంశంపై బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఈ కౌంటర్ ను దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు టాస్క్‌ఫోర్స్ నియమించిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ సూచనలను రాష్ట్రం ఆమోదించిందన్నారు. దాని ప్రకారం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఐదు సంవత్సరాల పదవీకాలం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదని నిబంధన ఉందన్నారు. ఎన్నికల కమిషనర్‌కు 65 సంవత్సరాల వయసు ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు కూడా చెబుతున్నాయని ఉటంకించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆమోదించిన టాస్క్‌ఫోర్స్ నిబంధనలను పట్టించుకోలేదన్నారు. రాజ్యాంగంలోని 217 నిబంధనకు ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పూర్తి విరుద్ధం అని పేర్కొన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఎన్నికల సంస్కరణల కిందకు రాదన్నారు.