కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు బయటకు రాకుండా ఉండటంతో అటవీ సమీప ప్రాంతంలో అడవి జంతువులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతిలో ఇటీవల దుప్పిలు, జింకలు రోడ్డుపై సంచరించడం తెలిసిందే. కేరళలోని ఒక ప్రాంతంలోని వీధిలో రాత్రి వేళ ఏనుగు దర్జాగా తిరిగిన సంఘటన ఆ వీధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజాగా కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం ఆలయ సమీపంలోని సాక్షిగణపతి, హటకేశ్వరం రహదారిలో చిరుతపులుల సంచారం చేస్తున్నాయి. రెండు చిరుత పులులు రోడ్డుపై తిరుగుతుండగా చూశామని స్థానికులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని దేవస్థానం అధికారులు, రెవెన్యూ అధికారులకు తెలియజేసారు.
దీంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం వారు మైక్ లో అనౌన్స్ మెంట్ చేసి స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంత వాసులు చిరుతల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు.