కరోనాకు లాక్‌డౌన్ పరిష్కారం కాదు: రాహుల్ గాంధీ

కరోనా మహమ్మరిని కేవలం లాక్డౌన్ తో మాత్రమే కట్టడి చేయాలని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో లాక్డౌన్ కారణంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరీక్షలు తక్కవగా జరుగుతున్నాయన్నారు. ఎక్కువ సంఖ్యలో టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు అతిపెద్ద ఆయుధం టెస్టింగేనని ఆయన అన్నారు. లాక్డౌన్ వల్ల కరోనాను జయించలేమని.. కొంతకాలం మాత్రం అడ్డుకోగలమన్నారు. ఒక్కసారిగా […]

Written By: Neelambaram, Updated On : April 16, 2020 4:25 pm
Follow us on


కరోనా మహమ్మరిని కేవలం లాక్డౌన్ తో మాత్రమే కట్టడి చేయాలని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో లాక్డౌన్ కారణంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరీక్షలు తక్కవగా జరుగుతున్నాయన్నారు. ఎక్కువ సంఖ్యలో టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు అతిపెద్ద ఆయుధం టెస్టింగేనని ఆయన అన్నారు.

లాక్డౌన్ వల్ల కరోనాను జయించలేమని.. కొంతకాలం మాత్రం అడ్డుకోగలమన్నారు. ఒక్కసారిగా లాక్డౌన్ ఎత్తేస్తే వైరస్ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో హాట్‌స్పాట్, నాన్ హాట్‌స్పాట్ అనే రెండు జోన్లు ఉండాలని ఆయన కేంద్రానికి సూచించారు. కేంద్రం ఆయా రాష్ట్రాలకు సాయం అదించాలనా్నరు. ప్రజలకు ఆహార భద్రతపై భరోసా కల్పించాల్సిన బాధ్యత మోదీ సర్కార్ పై ఉందన్నారు.

దేశంలోని వనరులన్నీ జాగ్రత్తగా వాడుకొనిl రాష్ట్రాలకు, జిల్లాలకు సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ప్రభుత్వాన్ని నిందించదలుచుకోలేదని తెలిపారు. కేవలం కేంద్రానికి సూచనలు మాత్రమే చేస్తున్నానని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.