దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లన్నీ వాయిదా పడ్డాయి. దీంతో సినీ సెలబ్రెటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు బీజీగా ఉండే సెలబ్రెటీలకు లాక్డౌన్ కారణంగా కొంత విరామం దొరికింది. ఈ సమయానికి వారంతా తమ ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడుతున్నారు వారంతా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మెగా అభిమానులతో నిత్యం టచ్లో ఉండే మెగా కోడలు ఉపాసన తాజాగా ఓ వీడియోను ట్వీట్లర్లో పోస్టు చేసింది. ఈ వీడియో మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
When @AlwaysRamCharan cooks dinner for the Mrs. 💕❤️
To all the husbands out there – he cooked dinner & also cleaned up after. Now that’s what makes him my hero ! 😉💕 pic.twitter.com/HOK8N1B7vc— Upasana Konidela (@upasanakonidela) April 15, 2020
మెగా పవర్ స్టార్ రాంచరణ్ లాక్డౌన్ సమయాన్ని తన భార్య ఉపాసనతో సరదాగా గడుపుతున్నారు. చెర్రీ తన ప్రియమైన భార్యకు స్వయంగా వంట చేస్తున్నాడని.. చివరకు అంట్లు కూడా తోముతున్నాడని ఉపాసన ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని భర్తలందరూ గమనించాలంటూ ట్యాగ్ చేసింది మెగా కోడలు. ఈ కామెంట్స్ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఆమె కామెంట్స్ కు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ‘చరణ్ నా దృష్టిలో రియల్ హీరో’ అంటూ లవ్ ఎమోజీలను ట్యాగ్ చేసింది ఉపాసన. ప్రస్తుతం చెర్రీ గరిటె పట్టుకొని వంట చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం చెర్రీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘ఆర్ఆర్ఆర్’లో, కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నాడు.