లాక్ డౌన్ పొడిగింపు: లాభమా? నష్టమా?

లాక్ డౌన్ ను కేంద్రం మరోసారి పొడిగించింది. మే 17వరకు కొనసాగిస్తామని తెలిపింది. అయితే మూడు జోన్లుగా విభజించి ఆయా ప్రాంతాల స్థితిగతులను బట్టి మినహాయింపులిచ్చింది.. కేంద్రం నిర్ణయం వల్ల కరోనా వ్యాపించని ప్రాంతాలకు ఊరట దక్కగా.. కరోనా ప్రబలంగా ఉన్న రెడ్, కంటోన్మెంట్ జోన్లలో పరిస్థితి మరింత కట్టుదిట్టమవుతుంది. దీంతో కొందరు జనాలు సేఫ్ జోన్లో ఉండగా.. మరికొందరు మాత్రం స్వేచ్ఛంగా నెలన్నర రోజుల తర్వాత ఊపిరిపీల్చుకునే అవకాశం ఏర్పడింది. లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు […]

Written By: Neelambaram, Updated On : May 2, 2020 11:05 am
Follow us on


లాక్ డౌన్ ను కేంద్రం మరోసారి పొడిగించింది. మే 17వరకు కొనసాగిస్తామని తెలిపింది. అయితే మూడు జోన్లుగా విభజించి ఆయా ప్రాంతాల స్థితిగతులను బట్టి మినహాయింపులిచ్చింది.. కేంద్రం నిర్ణయం వల్ల కరోనా వ్యాపించని ప్రాంతాలకు ఊరట దక్కగా.. కరోనా ప్రబలంగా ఉన్న రెడ్, కంటోన్మెంట్ జోన్లలో పరిస్థితి మరింత కట్టుదిట్టమవుతుంది. దీంతో కొందరు జనాలు సేఫ్ జోన్లో ఉండగా.. మరికొందరు మాత్రం స్వేచ్ఛంగా నెలన్నర రోజుల తర్వాత ఊపిరిపీల్చుకునే అవకాశం ఏర్పడింది.

లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

దేశవ్యాప్తంగా జిల్లాలను జోన్లుగా విభజించారు. ఇందులో 130 జిల్లాలు రెడ్ జోన్ గా ఉన్నాయి. తెలంగాణలో 18 ఆరెంజ్, 9 గ్రీన్ జోన్లు, 6 రెడ్ జోన్లుగా విభజించారు.

*గ్రీన్ జోన్ వారికి పండుగే..
గ్రీన్ జోన్లో మొత్తం వెసులుబాటును కల్పించారనే చెప్పవచ్చు. ప్రస్తుతం మునుపటి రోజులు ఈ జోన లో వచ్చేశాయి. బస్సులు తిరగడానికి కూడా అనుమతిచ్చారు. వృద్ధులు, పిల్లలు మాత్రం బయటకు రావద్దు. మద్యం, పాన్, గుట్కాలాంటి వాటిని కూడా ఇక్కడే తెరుస్తున్నారు. దీంతోపాటు పరిశ్రమలు, వివిధ వర్గాల వ్యాపారాలకు వెసులుబాటు కల్పించారు. ఈశాన్య రాష్ట్రాలు, గోవా సహా పలు రాష్ట్రాల్లో గ్రీన్ జోన్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ యథాతథా స్థాయి పునరుద్ధరించబడుతాయి. షాపుల నుంచి మొదలుపెడితే అన్ని వ్యాపారాలు. పనులను మునిపటిలాగానే యథేచ్చగా గ్రీన్ జోన్లలో చేసుకోవచ్చు.

లాక్ డౌన్ 3.0లో మందుబాబులకు శుభవార్త!

*ఆరెంజ్ జోన్లలోనూ కాస్త ఊరటే..
ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రీన్ జోన్లతోపాటు ఆరెంజ్ జోన్లలో కూడా మద్యం, పాన్, గుట్కా అమ్మకాలకు సోషల్ డిస్టేన్స్ పాటిస్తూ అమ్మకాలు సాగించుకోవచ్చని తెలిపారు. అయితే ఇక్కడ మద్యం అమ్మకాలు ఐచ్చికంగా వదిలేశారు. రాష్ట్రాలు అమలు చేయవచ్చు. లేదంటే బంద్ చేయవచ్చు. ఇక గ్రీన్ జోన్లలో మాత్రం మద్యం అమ్మకాలుంటాయి. ఆరెంజ్ జోన్లలో పరిమిత మంది ప్రయాణికులతో క్యాబ్ లకు అనుమతిచ్చారు.

*రెడ్ జోన్లలో సర్వం బంద్
శరామామూలుగానే రెడ్ జోన్లలో సర్వం బంద్ చేశారు. అన్నింటిపై నియంత్రణ కొనసాగుతుంది. రాత్రిపూట 7 గంటల నుంచి ఉదయం గంటల దాకా కర్ఫ్యూ ఉంటుంది. ఇక్కడ పూర్తిగా తగ్గే వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా కొనసాగించుకోవచ్చని కేంద్రం తెలిపింది.

*ఆర్థిక అతలాకుతలం.. మోడీ ఇచ్చిన రిలాక్సేషన్
ఆర్థికరంగం అతలాకుతలం అవుతుందని.. లాక్ డౌన్ పొడిగిస్తే ఆకలిచావులేనని తాజాగా ఆర్బీఐ మాజీ గవర్నర్లు రఘురామ రాజన్ , దువ్వూరి సుబ్బారావులు భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందుకే మోడీ సర్కారు ఎంతో కాలం లాక్ డౌన్ విధించి దేశాన్ని దిగ్బంధించలేమని నిర్ణయానికి వచ్చింది. ఇలానే లాక్ డౌన్ కొనసాగిస్తే కరోనా చావులంటే కంటే ఆకలిచావులే ఎక్కువ అవుతాయని వ్యాఖ్యానించారు. అందుకే మోడీ సర్కార్.. రెడ్, ఆరెంజ్ , గ్రీన్ జోన్లను విభజించి ఆయా జోన్లలో మినహాయింపులు ఇచ్చింది.

*లాక్ డౌన్ కొనసాగింపుతో లాభమా నష్టమా?
కేంద్రం తీసుకున్న లాక్ డౌన్ కొనసాగింపుతో లాభమా.? నష్టమా అని ఆలోచిస్తే.. లాభమేనని చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా ఉన్న ప్రాంతాలను లేని ప్రాంతాలను ఒకే గాటిన కట్టకుండా రెడ్ జోన్లలో కట్టడి చేస్తూ గ్రీన్ జోన్లలో మినహాయింపులు ఇచ్చింది. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకోవడానికి ప్రజలకు అవకాశం చిక్కింది. దీంతో ఉపాధికి మోడీ సర్కార్ బాటలు పరిచింది. ఇక మోడీ విధించిన ఈ త్రి ఫార్ములాను రాష్ట్రాలు అమలు చేస్తాయా? ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫస్ట్ నుంచి స్టిక్ట్ గా వెళుతున్నారు. ఆయన ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి