https://oktelugu.com/

పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలా?

తన దాకా వస్తేకానీ పత్రికలకు తత్వం బోధపడలేదు. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన పట్టుమని పదిరోజులకే తెలుగులోని రెండు అగ్రశ్రేణి దినపత్రికలు ఉద్యోగులను రోడ్డున పడేశాయి. వారికి కనీసం సమాచారం ఇవ్వకుండానే లీవుల పేరిట ఓ సంస్థ.. హోల్డ్ పేరిట మరో సంస్థ కొలువులు పీకేసింది. లాక్ డౌన్ ముగిసి మళ్లీ పునరుద్దరణ జరిగితే వీరి ఉద్యోగాలు ఉండేది.. లేదంటే వీరి జీవితాలు రోడ్డునపడ్టట్టే.. లాక్ డౌన్ 3.0లో మందుబాబులకు శుభవార్త! *కరోనా నష్టం పత్రికలకు రూ4500 […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 2, 2020 / 11:12 AM IST
    Follow us on


    తన దాకా వస్తేకానీ పత్రికలకు తత్వం బోధపడలేదు. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన పట్టుమని పదిరోజులకే తెలుగులోని రెండు అగ్రశ్రేణి దినపత్రికలు ఉద్యోగులను రోడ్డున పడేశాయి. వారికి కనీసం సమాచారం ఇవ్వకుండానే లీవుల పేరిట ఓ సంస్థ.. హోల్డ్ పేరిట మరో సంస్థ కొలువులు పీకేసింది. లాక్ డౌన్ ముగిసి మళ్లీ పునరుద్దరణ జరిగితే వీరి ఉద్యోగాలు ఉండేది.. లేదంటే వీరి జీవితాలు రోడ్డునపడ్టట్టే..

    లాక్ డౌన్ 3.0లో మందుబాబులకు శుభవార్త!

    *కరోనా నష్టం పత్రికలకు రూ4500 కోట్లు అట
    కరోనా లాక్ డౌన్ తో చిన్న కష్టానికే గుండెలు బాదుకొని గల్లాపెట్టె నుంచి రూపాయి తీయకుండా ఉద్యోగులను తీసేసిన పత్రికలు.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ముసలికన్నీరు కారుస్తున్నాయి. లాభాల్లో ఉండి కోట్లకు కోట్లు సార్వత్రిక ఎన్నికల వేళ క్యాష్ చేసుకున్న పత్రికల యాజమాన్యాలు నెలరోజుల లాక్ డౌన్ కుదేలయ్యాయట.. ఏకంగా కరోనా నష్టం రూ.4500కోట్లు అని.. వచ్చే ఆర్నెళ్లలో మరో 15వేల కోట్ల నష్టం అని కేంద్రానికి తాజాగా న్యూస్ పేపర్ సొసైటీ (ఎన్ఎన్ఎస్) వినతిపత్రం అందజేసింది. వెంటనే కేంద్రం తమను ఆదుకోవాలని విన్నవించుకుంది.800 వార్త పత్రికలపై 30 లక్షల మది జీవితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. పత్రికలు కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు.

    *ఉద్యోగులపై లేని కరోనా ప్రభుత్వానికి ఉంటుందా?
    కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను కరోనా నష్టం పేరుతో సాగనంపిన సంస్థలు ఇప్పుడు కేంద్రం ఆదుకోవాలని అంటున్నాయి. సొంత సంస్థలకు లేని పట్టింపు 130కోట్ల మందిని చూసుకునే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా అంటే అనుమానమే.. ప్రస్తుతం ఐఎన్ఎస్ కేంద్రానికి ఇచ్చిన వినతిలో రెండేళ్లపాటు పన్ను రాయితీ, ప్రభుత్వం ప్రకటన రేట్లు పెంచడం.. ప్రింట్ మీడియాకు ప్రకటనల బడ్జెట్ పెంచడం , కేంద్రం బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

    లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

    *ఉద్యోగులకు ఒక న్యాయం.. పత్రికా సంస్థలకు ఒకన్యాయమా?
    కరోనా లాక్ డౌన్ తో 10 రోజుల నష్టాన్ని కూడా పత్రికలు భరించకుండా జర్నలిస్టులను రోడ్డు పాలు చేశాయి. ఇన్నాళ్లు సంపాదించిన సొమ్మును కనీసం ఒక నెలపాటు పత్రిక కోసం జర్నలిస్టుల జీవితాల కోసం ఖర్చు చేయలేదు. ఇప్పడు మొత్తం నష్టపోయామని కేంద్రం ఆదుకోవాలని కోరుతున్నాయి. జర్నలిస్టులు ఎలాగూ రోడ్డునపడ్డారు. తిరిగి పత్రికలు పునరుద్దరించబడడం కష్టమే. వారి ఉద్యోగాలు రావడం కష్టమే. మరి ఇంతమందిని రోడ్డుపాలు చేసిన పత్రికా యాజమాన్యాలకు కేంద్రం సాయం చేసినా అరకొరతోనే నడిపిస్తాయి. చేయకున్నా నడిపిస్తాయి. ఉద్యోగులను తిరిగి తీసుకుంటేనే ప్యాకేజీ ఇస్తే బాగుంటుంది. లేదంటే ప్యాకేజీని జేబులో వేసుకొని జర్నలిస్టులను అలాగే వదిలేసే ప్రమాదం ఉంది. జర్నలిస్టులందరినీ తీసుకుంటేనే ప్యాకేజీ ఇచ్చేలా కేంద్రం చొరవచూపాల్సిన అవసరం ఉంది

    *ఇంతటి సంక్షోభంలో కేంద్రం ఆదుకోవడం కష్టమే..
    రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను ఆదుకునే విషయంలో కూడా కేంద్రం చేతులెత్తి రాష్ట్రాలపై భారం మోపింది. అలాంటిది ప్రైవేటు వారి చేతుల్లో ఉండి.. అది ప్రభుత్వాలను ఎప్పుడూ విమర్శించే పత్రికలు.. మీడియాను కేంద్రం ఆదుకుంటుందన్నది అత్యాశే. మీడియా పవర్ ఎంత తగ్గితే పాలకులకు అంత నయం. అందుకే పత్రికా యాజమాన్యాలకు కేంద్ర ప్రభుత్వ సాయం చేస్తుందనుకోవడం అత్యాశే. జర్నలిస్టుల జీవితాలను రోడ్డున పడేసిన సంస్థలపై ఇప్పుడు వారంతా కోపంగా ఉన్నారు. సంస్థ బతికినా తమను తీసుకుంటుందన్న గ్యారెంటీ లేదు. సో ఇలాంటి సంస్థలకు కేంద్రం సాయం చేసినా దండగే అని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. జర్నలిస్టులందరినీ తీసుకుంటామంటేనే కేంద్రం సాయం చేయాలని కోరుతున్నారు.

    -నరేశ్ ఎన్నం