లాక్‌డౌన్ నిబంధనలకు ఉల్లంఘిస్తూ సమావేశాల్లో పాల్గొంటున్న అధికారపార్టీ నేతలను అడ్దుకోవాలంటూ లాయర్ కిశోర్ పిల్ వేశారు. నిబందలను ఉల్లంఘించిన వైసీపీ నేతలకు కరోనా పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్ కు తరలించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ప్రతివాదులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భియ్యపు మధుసూదన్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజారెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీలను చేర్చారు.
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితంకావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి న్యాయవాది
గుర్తు చేశారు. అయినా కొందరు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు యదేచ్ఛగా జనంలో తిరుగుతున్నారని తెలిపారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల తీరును తప్పుబడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందడానికి అధికార పార్టీ నాయకుల వైఖరే కారణమంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికార పార్టీ నాయకులకు పిల్ తో కొత్త చిక్కులు వచ్చినట్లయ్యింది.