మూడవ దశలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ఈ నెల మే 17 వరకు మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే లాక్ డౌన్ లో అనేకమైన ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అందులో భాగంగా గ్రీన్ జోన్లలో మద్యం, పాన్ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం, పాన్ షాపులకు కేంద్రం సడలింపును ఇచ్చింది. ఆయా షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ రెండో దఫా ఈ నెల 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి 17వ తేదీ వరకు లాక్ డౌన్ మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతంలో మార్చి 24 నుంచి మే 3 వరకు రెండు దశలలో మొత్తం 40రోజుల పాటు కఠినమైన ఆంక్షల మధ్య లాక్ డౌన్ ని అమలుపరిచిన విషయం తెలిసిందే.