కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ పీరియడ్ ని పెంచుకుంటూ వెళ్తున్న సమయంలో తెలంగాణ ఇంటర్ బోర్డ్ విద్యార్థులకు, విద్యాలయాలకు కొన్ని ఆదేశాలు, హెచ్చరికలను జారీ చేసింది. తాజాగా లాక్ డౌన్ 3.0 ని మరో రెండు వారాల పాటు పొడిగించిన నేపథ్యంలో ఈ ఆదేశాలను బేఖాతరు చేయకూడదని బోర్డ్ హెచ్చరించింది. ఆ ఆదేశాలు ఇవే..
- లాక్ డౌన్ ముగిసే వరకు ప్రైవేటు కాలేజ్ లు ఏవి కుడా ఇంటర్ ఫస్ట్ ఈయర్ అడ్మిషన్లు తీసుకోవద్దు.
- విద్యార్థులు ఎవరు కూడా ఫీజు కట్టి అడ్మిషన్లు తీసుకోవద్దు.
- పదో తరగతి పరీక్షలు పూర్తి కానందున్నా కాలేజీ లకు బోర్డు ఆఫ్లియేషన్ ఇవ్వలేదు.
- విద్యార్థులు అడ్మిషన్ల ఫీజులు చెల్లించి నష్టపోవద్దు.
- ఈ సారి కొన్ని కాలేజీల గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉంది.
- ఏవైనా కాలేజీ లు విద్యార్థుల దగ్గర అడ్మిషన్లు తీసుకంటే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటమని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఒమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు.
