LiveCaller : ఐఫోన్ వాడుతున్న యూజర్ల కోసం ఆపిల్ కొత్త రియల్ టైమ్ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ లైవ్‌కాలర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త యాప్ స్పామ్ కాల్స్, రోబో కాల్స్, టెలిమార్కెటింగ్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ నుంచి ఐఫోన్ యూజర్లను కాపాడటానికి సాయపడుతుంది. ఈ యాప్ ట్రూకాలర్, హియా వంటి యాప్‌లకు పోటీదారుగా నిలవనుంది.
లైవ్ కాలర్ ప్రత్యేకతలు
ఈ కొత్త ఫీచర్ ఐఫోన్ వాడుతున్న యూజర్ల కాల్ స్క్రీన్‌పై వచ్చే కాల్‌ల వివరాలను చూపిస్తుంది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కాంటాక్ట్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతి అడగదు. ఐఫోన్ యూజర్‌లు అకౌంట్ క్రియేట్ చేయమని కూడా అడగదు.
అందరూ ఐఫోన్ యూజర్‌లు వాడగలరా?
ఈ యాప్‌ను Sync.ME అభివృద్ధి చేసింది. ఈ యాప్ యూజర్‌లకు రియల్ టైమ్‌లో తెలియని నంబర్‌ల వివరాలను చూపించే పని చేస్తుంది. ఈ సేవ 4 బిలియన్ కంటే ఎక్కువ ఫోన్ నంబర్‌లకు అందుబాటులో ఉందని ఆపిల్ తెలిపింది. ఈ యాప్ ప్రస్తుతం 28 భాషల్లో సపోర్ట్ చేస్తుంది. లైవ్ కాలర్ ఐడి లుకప్ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది. ఈ యాప్ కేవలం ఆపిల్ కంపెనీ iOS 18.2,అంతకంటే ఎక్కువ వెర్షన్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
ఆపిల్ లైవ్ కాలర్ ఐడి లుకప్ ఫ్రేమ్‌వర్క్ కాలర్ ఐడి యాప్‌లకు తెలియని ఇన్‌కమింగ్ కాల్‌లను గుర్తించడంలో సాయపడుతుంది. ఈ పని కోసం యాప్‌ను తెరవాల్సిన అవసరం లేదు. సెన్సెటివ్ పర్మీషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు పాప్-అప్ లేదా ఫుల్ స్క్రీన్ కాల్ ఇంటర్‌ఫేస్‌పై స్పామ్, ఫ్రాడ్ కాల్‌ల వివరాలు చూడవచ్చు.
చాలా కాలర్ ఐడి యాప్‌లు స్పామ్, రోబో కాల్స్, టెలిమార్కెటింగ్ కాల్‌ల గురించి ముందుగానే సమాచారం ఇస్తాయి, కానీ ఈ థర్డ్ పార్టీ యాప్‌లన్నీ ప్రజల నుండి వారి ముఖ్యమైన సమాచారం అనుమతి అడుగుతాయి. ప్రభుత్వ డేటా ప్రకారం, 2024లో ఆర్థిక మోసాల కారణంగా ప్రజలు 177 కోట్లకు పైగా నష్టపోయారు.
Also Read : ట్రూ కాలర్ కు ప్రత్యామ్నాయంగా ట్రాయ్ కొత్త విధానం.. కాల్ చేసిన వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు. .