లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు మద్యం షాపులు మూసి ఉన్నాయి. మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో అటు రాష్ట్ర ఆదాయానికి కూడా గండిపడింది. అన్‌లాక్‌తో ఓపెన్ అయిన మద్యం షాపుల్లో రోజురోజుకూ అమ్మకాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డే వేరు. ఎక్కువ లిక్కర్ ఇక్కడే అమ్ముడుపోతుంటుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం మరో రికార్డు నమోదైంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే తెలంగాణ వ్యాప్తంగా అక్షరాల రూ.2623 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. నెల వ్యవధిలో ఇంత భారీగా మద్యం అమ్మకాలు సాగటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఆల్ టైం రికార్డుగా చెబుతున్న ఈ వైనం అధికారులను మాత్రమే కాదు.. ప్రభుత్వ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Also Read: విజయశాంతి సంచలన వ్యాఖ్యల వెనుక కథేంటి?
గత ఏడాది ఇదే అక్టోబరులో తెలంగాణ వ్యాప్తంగా సాగిన మద్యం అమ్మకాలు కేవలం రూ.1,663 కోట్లు మాత్రమే జరిగింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అదే అక్టోబరులో నెలలో ఏకంగా వెయ్యి కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగటం విశేషం. ఈ లెక్కన తెలంగాణ వ్యాప్తంగా మద్యం ఎంత భారీగా వినియోగిస్తున్నారో అర్థం అవుతోంది.
Also Read: కాంగ్రెస్.. బీజేపీలపై ఫైరవుతున్న కేటీఆర్.. ఎందుకు?
ఇదిలా ఉండగా.. అక్టోబరులో ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు నమోదు కావటానికి కారణం చివరి వారంలో జరిగిన కొనుగోళ్లేనట. అక్టోబరు 22 నుంచి 27 వరకు ఏ రోజు కూడా రూ.110 కోట్ల అమ్మకాలకు తగ్గకపోవటం గమనార్హం. మధ్యలో 24న రూ.99.8 కోట్ల మేర అమ్మకాలు సాగితే.. అత్యధికంగా 25..26 తేదీల్లో రోజుకు రూ.132 కోట్ల చొప్పున అమ్మకాలు జరగటం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా అమ్మకాలు జరగటానికి కారణం ధరలు పెరటం ఒకటిగా చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబరులో బీర్ కేసులు వినియోగం తగ్గగా.. లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగినట్లుగా గుర్తించారు. ఏది ఏమైనా కరోనా దెబ్బకు ప్రభుత్వ ఆదాయం తగ్గిందన్న వేళ.. మద్యం అమ్మకాలు ఇంత భారీగా పెరగడంతో ప్రభుత్వ ఖజానాకు బూస్టింగ్ లభించినట్లయింది.