https://oktelugu.com/

వెంకీ..రానా కాంబో.. ఫిక్సయిన ముహుర్తం..!

కొద్దిరోజులుగా టాలీవుడ్లో మల్టిస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుండటంతో దర్శక, నిర్మాతలు మల్టిస్టారర్ మూవీలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇండస్ట్రీలో అందరితో స్నేహంగా ఉండే విక్టరీ వెంకటేష్ ఇటీవలీ కాలంలో మల్టిస్టారర్ మూవీల్లో ఎక్కువగా నటిస్తున్నాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. పవన్ కల్యాణ్ తో ‘గోపాలగోపాల’.. వరుణ్ తేజ్ తో ‘ఎఫ్-2’.. నాగచైతన్యతో ‘వెంకీమామ’ వంటి చిత్రాల్లో నటించాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 / 10:52 AM IST
    Follow us on

    కొద్దిరోజులుగా టాలీవుడ్లో మల్టిస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుండటంతో దర్శక, నిర్మాతలు మల్టిస్టారర్ మూవీలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇండస్ట్రీలో అందరితో స్నేహంగా ఉండే విక్టరీ వెంకటేష్ ఇటీవలీ కాలంలో మల్టిస్టారర్ మూవీల్లో ఎక్కువగా నటిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. పవన్ కల్యాణ్ తో ‘గోపాలగోపాల’.. వరుణ్ తేజ్ తో ‘ఎఫ్-2’.. నాగచైతన్యతో ‘వెంకీమామ’ వంటి చిత్రాల్లో నటించాడు. ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. నిర్మాత సురేష్ బాబు సైతం వెంకీ.. రానాలతో ఓ మల్టిస్టారర్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు.

    Also Read: బిగ్ బాస్’ చేష్టలకు కన్నీరు పెట్టుకున్న అవినాష్.. అరియానా..!

    వెంకీ-రానా కాంబినేషన్లో మూవీ కోసం దగ్గుపాటి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మూవీ రాబోతుందని దగ్గుపాటి రానా స్వయంగా ప్రకటించాడు. ఇన్నాళ్లూ ఎలాంటి కథ కోసమైతే చూశామో.. ఆ కథ దొరికిందని రానా తెలిపాడు. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని రానా చెప్పడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    Also Read: బిగ్ బాస్-4: పట్టుకోసం ‘బిగ్ బాస్’తండ్లాట..! వైల్డ్ కార్డ్ గా సుమ

    వెంకీ-రానా కాంబోలో రానున్న మూవీ 2021లో పట్టాలెక్కనుందని సమాచారం. ఇప్పటికే స్క్రీప్టు పనులు ఓ కొలిక్కి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా దర్శకుడు.. మిగతా నటీనటుల ఎంపిక ఖరారు కానుంది. ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించనున్నాడు. ఎట్టకేలకు దగ్గుపాటి ఫ్యామిలీ హీరోలు కలిసి నటించనుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.