https://oktelugu.com/

ఏపీలో వారి దాహం తీరనిది.!

ఏ రంగానికైనా కొరత ఉంటుందేమో కానీ మద్యానికి.. మందుబాబుల దాహానికి కొరత అనేదే ఉండదు. ఎంత సంపాదించినా అందులో కొంత మద్యానికి ఖర్చు చేసే వారు చాలా మంది ఉంటారు.ఇప్పుడు సమాజంలో మందు తాగని వారంటూ లేరు. ఆడవారు కూడా మద్యానికి బానిస అయిపోయారు. లాక్ డౌన్ లో మందు దొరక్క ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూశాం. మద్యం షాపులు తెరిస్తే ఆడవారు కూడా క్యూలు కట్టిన వైనం అందరినీ విస్తుగొలిపింది. పవన్ ప్రణాళిక మొత్తం చెడేలా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 7, 2020 / 08:03 PM IST
    Follow us on


    ఏ రంగానికైనా కొరత ఉంటుందేమో కానీ మద్యానికి.. మందుబాబుల దాహానికి కొరత అనేదే ఉండదు. ఎంత సంపాదించినా అందులో కొంత మద్యానికి ఖర్చు చేసే వారు చాలా మంది ఉంటారు.ఇప్పుడు సమాజంలో మందు తాగని వారంటూ లేరు. ఆడవారు కూడా మద్యానికి బానిస అయిపోయారు. లాక్ డౌన్ లో మందు దొరక్క ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూశాం. మద్యం షాపులు తెరిస్తే ఆడవారు కూడా క్యూలు కట్టిన వైనం అందరినీ విస్తుగొలిపింది.

    పవన్ ప్రణాళిక మొత్తం చెడేలా ఉందే..!

    అయితే ఏపీలో ఇప్పుడు మద్యమే ఆ సర్కార్ ను నడిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ కంటే డబుల్ రేట్లను ఏపీలో పెంచేశారు. మద్యపాన నిషేధంలో భాగంగా భారీగా రేట్లు పెంచేశారు. తాగేవారు ఎంత పెట్టైనా కొంటారు కాబట్టి జగన్ సర్కార్ గల్లాపెట్టే నిండుగా ఉంటుందట.. మద్యమే జగన్ సర్కార్ ను నడిపిస్తోందన్న టాక్ కూడా ఉంది. ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు.. పైగా రాత్రి 8 గంటల వరకే మద్యం షాపులు కట్టేయడంతో మందుబాబులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పైగా పేరున్న ప్రముఖ బ్రాండ్లు ఏపీలోని సర్కారు మద్యం షాపుల్లో దొరకడం లేదు. దీంతో కొందరు మద్యం ప్రియులు కొత్త దందా మొదలుపెట్టారు.

    తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దున గల వైన్స్ నుంచి భారీగా ఏపీ వాసులు మద్యం కొనుగోలు చేసి గుట్టు చప్పుడు కాకుండా ఏపీకి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రూ.25 నుంచి రూ.100 వరకూ తెలంగాణకు- ఏపీకి ధరల మధ్య తేడాలు ఉండడంతో ఇక్కడి నుంచి తరలిస్తూ లాభాల పంట పండిస్తున్నారట.. సరిహద్దు గ్రామాలకు పెద్ద ఎత్తున తెలంగాణ మద్యం సరఫరా అవుతోందట.. తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోనే ఏకంగా అక్రమమద్యం కేసులు 61 నమోదయ్యాయి. 80మందిని అరెస్ట్ చేశారు.

    రాజమండ్రి సెంట్రల్ జైలుకి కొల్లు రవీంద్ర..

    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ శంకర్ నాయక్ ఇంట్లో భారీగా మద్యం బయటపడింది. అతడి ఇంటిపై ఎక్సైజ్ అధికారులు చేసిన దాడిలో ఏకంగా 368 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో దొరికే మద్యం కంటే చీప్ గా కర్ణాటక మద్యం దొరుకుతుంది. దీంతో సరిహద్దుల్లోంచి కర్ణాటక వెళ్లిన రిపోర్టర్ తనను ఎవరూ పోలీసులు ఆపరన్న ధైర్యంతో కర్ణాటక మద్యాన్ని భారీగా తెచ్చి కళ్యాణదుర్గంలో నిల్వచేసి అమ్ముతున్నట్టు గుర్తించారు.

    ఏపీలో మద్యం ధరలు పెరగడం పేద, మధ్యతరగతి వారికి భారంగా మారింది. ఎంత ధరకైనా కొనడానికి వెనుకాడకపోవడంతో రోజు వారిగా పనిచేసిన కూలీలు సంపాదనను మద్యానికే తగలేస్తున్నారు.

    ఏపీతో పోలిస్తే చీప్ గా దొరికే తెలంగాణ, కర్ణాటక మద్యంను ఇప్పుడు విచ్చలవిడిగా కొనుగోలు చేసి ఏపీలోని ధరలకే అమ్ముకుంటున్నారు. తద్వారా వ్యాపారులు, బెల్ట్ షాపుల వారు లాభాలు గడిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పల్నాడు వాసులు ఎక్కువగా మద్యాన్ని తెలంగాణ నుంచి పల్నాడుకు తరలిస్తున్నారు. అటు ఖమ్మం నుంచి మహబూబ్ నగర్ వరకూ తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ మార్గాల్లో ఏపికి మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. తద్వారా ఏపీ ఖాజానకు గండిపడుతుండగా.. తెలంగాణ, కర్ణాటక ఎక్సైజ్ శాఖ పంట పండుతోంది.