ఎన్టీఆర్ కూడా వైసీపీ శిబిరంలో చేరిపోయారా?

ఏపీలోని సత్తెనపల్లిలో వెలిసిన ఓ ఫ్లెక్సీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామరావు ఫొటో వైసీపీ ఫ్లెక్సీలో ప్రత్యక్షమైంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్మోరెడ్డి ఫొటోలతోపాటు స్వర్గీయ ఎన్టీఆర్ ఫొటోలు పక్కనే ఉండటం ఆసక్తిని రేపుతోంది. ఈ ఫ్లెక్సీ చూపురులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఫ్లెక్సీ వెనుక ఏదైనా రాజకీయం ఎత్తుగడ ఉందా అనే చర్చ నడుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి కొల్లు రవీంద్ర.. […]

Written By: Neelambaram, Updated On : July 8, 2020 10:33 am
Follow us on


ఏపీలోని సత్తెనపల్లిలో వెలిసిన ఓ ఫ్లెక్సీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామరావు ఫొటో వైసీపీ ఫ్లెక్సీలో ప్రత్యక్షమైంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్మోరెడ్డి ఫొటోలతోపాటు స్వర్గీయ ఎన్టీఆర్ ఫొటోలు పక్కనే ఉండటం ఆసక్తిని రేపుతోంది. ఈ ఫ్లెక్సీ చూపురులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఫ్లెక్సీ వెనుక ఏదైనా రాజకీయం ఎత్తుగడ ఉందా అనే చర్చ నడుస్తోంది.

రాజమండ్రి సెంట్రల్ జైలుకి కొల్లు రవీంద్ర..

సినిమాల్లో అగ్రనటుడిగా ఉన్న ఎన్టీఆర్ నాటి కుల్లు రాజకీయాలకు వ్యతిరేకిస్తూ టీడీపీని స్థాపించారు. తొమ్మిది నెలల్లోనే బ్రహ్మండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చి తెలుగువాడి సత్తాచాటారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజారంజాక పాలన సాగించారు. అయితే ఆయనను ఆ పార్టీలోని కొందరు నేతలే మోసంచేసి పార్టీని హైజాక్ చేసినా కుంగిపోకుండా జనంలోకి వెళ్లి తేల్చుకున్నారు. ప్రస్తుతం ఏపీలోనూ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. బలంలేకపోయినా జగన్ సర్కార్ ను పడగొడుతామంటూ పదేపదే బీరాలు పలుకుతున్నారు. అయితే ఏదైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

సీఎంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటున్నారు. పార్టీలోని జనాల కంటే ప్రజలే ఎక్కువ అనే సందేశాన్ని ఇస్తున్నారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళుతున్నారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి వారసుడిగా ప్రజా సంక్షేమానికి పెద్దపీఠ వేస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజల్లో ఉంటూనే తిప్పికొడుతున్నారు.

జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

తెలుగు నేలపై దూకుడు రాజకీయాలకు ఆజ్యంపోసిన ఎన్టీఆర్ ను వైసీపీ నేతలు ఓన్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ తో సీఎం జగన్మోహన్ రెడ్డిని పోలుస్తున్నారు. తెలుగు ప్రజల్లో గుండెల్లో చెరగని ముద్రవేసిన ఎన్టీఆర్, వైఎస్ఆర్ ను ఆపార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డితో పోలుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాలు చూసి ఆ పార్టీలో చేరుతున్న సంగతి తెల్సిందే. అయితే ఒక్కసారిగా ఈ ఫ్లెక్సీలు చూసిన టీడీపీ నేతలు ఎన్టీఆర్ కూడా వైసీపీ శిబిరంలో చేరారా? అంటూ అవాక్కవుతున్నారు. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం జగన్ కు మద్దతు పలుకుతుండటం గమనార్హం.