ఏపీలోకి అక్రమ మద్యం ప్రవాహం.. కాదేది అనర్హం!

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి మద్యం తరలించడానికి కనిపించిన ప్రతీ అడ్డదారి తొక్కుతోంది లిక్కర్‌‌ మాఫియా. బస్సుల్లో, కార్లలో, కొరియర్‌‌లో, టూవీలర్ల మీద కూడా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఏపీలో ఈ మద్యం వ్యాపారం చేసే వాళ్ళు వాటిని దాచేందుకు కొత్త పద్ధతులను ఎంచుకున్నారు. అప్పట్లో పెద్ద వాటర్ ట్యాంక్‌లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. రోజుకో రకంగా ఏపీలోకి అక్రమంగా మద్యం తరలుతోంది. అంబులెన్స్ లో, చేపలు తరలించే వ్యాన్లలో.. బియ్యం బస్తాల్లో, ఖాళీ […]

Written By: NARESH, Updated On : September 26, 2020 7:59 pm
Follow us on

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి మద్యం తరలించడానికి కనిపించిన ప్రతీ అడ్డదారి తొక్కుతోంది లిక్కర్‌‌ మాఫియా. బస్సుల్లో, కార్లలో, కొరియర్‌‌లో, టూవీలర్ల మీద కూడా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఏపీలో ఈ మద్యం వ్యాపారం చేసే వాళ్ళు వాటిని దాచేందుకు కొత్త పద్ధతులను ఎంచుకున్నారు. అప్పట్లో పెద్ద వాటర్ ట్యాంక్‌లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. రోజుకో రకంగా ఏపీలోకి అక్రమంగా మద్యం తరలుతోంది. అంబులెన్స్ లో, చేపలు తరలించే వ్యాన్లలో.. బియ్యం బస్తాల్లో, ఖాళీ గ్యాస్ సిలిండర్లలో, ఒంటికి ప్లాస్టర్లు అంటించుకొని కొందరు.. ఇలా రోజుకో రకంగా తరలిస్తున్నా ఎక్కడో ఒకచోట దొరుకుతూనే ఉన్నారు.

Also Read: ఏపీలో రేషన్ కార్డుల జారీ.. సీన్ రివర్స్ అయిందా?

ఇప్పటికే ఈ అక్రమ రవాణాను అరికట్టడానికి తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. కానీ అధికారుల కళ్లుగప్పి ఇలా రోజుకో విధంగా మద్యం తరలించేందుకు అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఏపీలోకి భారీగా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు.

తాజాగా మరో కొత్త మార్గం బయటపడింది. కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసుల తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. పాల వ్యాన్ లో మద్యం తరలిస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. పాలవ్యాన్ ని కూడా అధికారులు స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: బీజేపీ కొత్త కార్యవర్గం: పాత కాపులకు బై.. కొత్త నేతలకు జై

ఏపీలో మధ్యపాన నిషేధం దిశగా జగన్ సర్కార్ మద్యం ధరలను భారీగా పెంచేసింది. దీంతోపాటు మంచి బ్రాండెడ్ మద్యం ఏపీలో దొరకడం లేదట.. దీంతో మద్యానికి ఏపీలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆ క్రమంలోనే ఏపీకి పక్క రాష్ట్రాల నుంచి మద్యం పోటెత్తుతోంది.