సినీ వినీలాకాశంలో బాలుగారి మహోన్నతమైన గాత్రానికి అభిమాని కాని వారు ఎవరు ఉంటారు. తెలుగువారి ఆరాధ్య స్వరంగా ఒక వెలుగు వెలిగిన భారతీయ సంగీతమ్మ ముద్దు బిడ్డ ఆయన. ఐదు దశాబ్దాలకు పైగా, 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వడు ఆయన. ఆయన పాడిన పాటలు, ఆయన మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతూనే ఉంటాయి. పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం, ఆయన ఉంటారు. ఆయన ఎప్పటికీ అమరులే. బహుశా అమృతం పై దేవుళ్ళకు చికాకు పుట్టి.. బాలుగారి అమృతం లాంటి గాత్రం కోసం ఆయనను పై లోకానికి ఆ దేవతలు తీసుకెళ్ళిపోయి ఉంటారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ షూట్ లో కొత్త మార్పులు !
ఇక బాలుగారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నా.. తమిళులు మాత్రం ఆయన పై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తారు. ఆయన్ను అసలు తెలుగువాడిగా వారు భావించరు, తమ వారిగా తమలో ఒకరుగానే వారు బలుగారిని మొదటినుండి ఆదరిస్తూ వస్తున్నారు. అంతలా తమిళ అభిమానుల్ని సొంతం చేసుకున్న బాలుగారు, నిన్న పరమపదించడంతో.. ఆయన తమిళ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకనుండి ఆ తీయని స్వరం ఈ పుడమి మీద లేదు అని వారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. సహజంగా ఎవరైనా తమ అభిమాన హీరోనో, రాజకీయ నాయకుడో మరణిస్తే అభిమానులు ఇలా అల్లాడిపోతారు. కానీ ఒక గాయకుడు మరణిస్తే.. వేలాదిగా జనం ఆయన ఇంటికి ఇంకా పోటెత్తటం బాలుగారికి మాత్రమే సాధ్యమైంది.
Also Read: చరణ్ తో వంశీ పాన్ ఇండియా సినిమా !
కరోనా పరిస్దితుల్లో కూడా అభిమానులు బాలుగారి పార్దీవ దేహాన్ని చూడడానికి క్యూ కట్టారు. ఈ నేపధ్యంలో బాలుగారిని చూసేందుకు వచ్చిన ఓ తమిళ అభిమాని భావోద్వేగంతో కుప్పకూలిన ఉదంతం ఆయన ఇంటివద్ద చోటు చేసుకుంది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స చేసి.. హాస్పిటల్ కి పంపారు. ఇక బాలుగారి తమిళ అభిమానులు చెన్నైలో బాలుగారి విగ్రహం పెట్టబోతునట్లు తెలుస్తోంది. సినీ వినీలాకాశంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన ఒక తెలుగు వ్యక్తిని, తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఆరాధించడం బాలుగారికి దక్కిన గౌరవం.