LIC : ఎల్ఐసి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అలాగే వారికి మెరుగైన సురక్షితమైన పెట్టుబడి ఎంపికలను అందించడం కోసం, పాలసీదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించడం లక్ష్యంగా అనేక పాలసీలను రూపొందించింది. ఇప్పటివరకు లైఫ్ ఇన్సూరెన్స్ లో ఎన్నో కంపెనీలు వచ్చినప్పటికీ కూడా ఎల్ఐసి మాత్రం టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఎల్ఐసి వారు అందిస్తున్న జీవన్ లాభ్ సేవింగ్స్ ప్లాన్ పాలసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లాన్ లో మీరు మెచ్యూరిటీ సమయానికి ఎక్కువ మొత్తంలో అందుకుంటారు. పాలసీ మెచ్యూరిటీ కాలం కంటే కూడా ముందుగానే సదరు వ్యక్తి మరణించినట్లయితే అతని కుటుంబ సభ్యులకు ఈ పాలసీ ఆర్థిక భరోసా అందిస్తుంది.
ఒక వ్యక్తి తనకు 25 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలో ఎల్ఐసి లో ఉన్న జీవన్ లాబ్ పాలసీలో 25 ఏళ్ల కాలానికి పెట్టుబడి పెడుతున్నట్లయితే అతనికి మెచ్యూరిటీ సమయానికి ఏకంగా రూ.60 లక్షల కంటే కూడా ఎక్కువ మొత్తం అందుతుంది. ఆ వ్యక్తి ప్రతి నెల రూ.8893 చెల్లించడం వలన ఎల్ఐసి లో ఈ ప్లాన్ లో లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే కేవలం ప్రతిరోజు రూ.296 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎల్ఐసి వారు అందిస్తున్న ఈ ప్లాన్ లో మీరు భారీ కార్పస్ పొందడానికి ఏడాదికి రూ.1,04,497 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ లో మీరు ప్రతిరోజు పెట్టే పెట్టుబడిని మరికొంత పెంచడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి కోటి రూపాయలు కూడా పొందవచ్చు.
Also Read : నెలకు కేవలం వెయ్యి రూపాయలతో రూ.86 లక్షల రాబడి..LIC లో అద్భుతమైన స్కీమ్..
ఉదాహరణకు ఒక వ్యక్తి తనకు 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ పాలసీలో పెట్టుబడి ప్రారంభించినట్లయితే 25 ఏళ్ల పాటు అతను ప్రతిరోజు రూ.512 చొప్పున పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన ఈ పాలసీలో ఆ వ్యక్తి మెచ్యూరిటీ సమయానికి ఏకంగా కోటి రూపాయల తొమ్మిది లక్షలు రాబడి పొందవచ్చు. మీరు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీకు సమీపంలో ఉన్న ఎల్ఐసి కార్యాలయాన్ని లేదా వారి కస్టమర్ కేర్ నెంబర్లకు కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఎల్ఐసి లో పాలసీ కొనుగోలు చేసే ముందు ఏజెంట్లు చెప్పే మాటలకు పడిపోకుండా ఆ పాలసీ ప్రయోజనాలతో పాటు దానికి ఉండే చట్టపరమైన నిబంధనల గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.