spot_img
Homeజాతీయ వార్తలుLeft parties decline in India: లెఫ్ట్ పార్టీలు.. దేశం నుంచి లెఫ్ట్ అయినట్టే..

Left parties decline in India: లెఫ్ట్ పార్టీలు.. దేశం నుంచి లెఫ్ట్ అయినట్టే..

Left parties decline in India: ఒక దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు.. కచ్చితంగా అక్కడి భావజాలాన్ని కలిగి ఉండాలి. అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ ఉండాలి. అలా కాకుండా అరువు తెచ్చుకున్న విధానాలతో పనిచేస్తాం. విదేశీ విధాలను కొనసాగిస్తాం.. ఎక్కడివో సిద్ధాంతాలను జనాల మీద రుద్దుతామంటే కుదరదు. అప్పుడు ఉద్యమాలు చేశాం.. రైతుల పక్షాన నిలబడ్డాం. అంటే జనాలు ఒప్పుకోరు. ఎందుకంటే నేటి కాలంలో ఒకప్పటి విధానాలు పనికిరావు. ఇప్పటి వర్తమానాలు మాత్రమే జనాలకు కావాలి.

మనదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీలుగా వామపక్షాలకు పేరుంది. రైతుల పక్షాన.. పేదల పక్షాన వామపక్షాలు అనేక పోరాటాలు చేశాయి. పాలక ప్రభుత్వాలను నేలకు దించాయి. మనదేశంలో తయారీ కేంద్రంగా పేరుపొందిన బెంగాల్ రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నాయి వామపక్ష పార్టీలు. త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాలలో కూడా వామపక్షాలు అధికారాన్ని సొంతం చేసుకున్నాయి. నిన్నటి వరకు కూడా కేరళ రాష్ట్రంలో వామపక్షాలు పరిపాలన సాగించాయి.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వామపక్షాలు తప్పుకొని చాలా సంవత్సరాలు అయింది. త్రిపుర వంటి రాష్ట్రం నుంచి కూడా వామపక్షాలు అధికారం నుంచి దూరం జరిగాయి. ఇంకా చాలా రాష్ట్రాలలో కూడా వామపక్షాలు అధికారాన్ని కోల్పోయాయి.. తెలుగు రాష్ట్రాల్లో కామ్రేడ్లు తమ ప్రాతినిధ్యం కోల్పోయారు. తమిళనాడు వంటి రాష్ట్రంలో కూడా కామ్రేడ్లు బలం కోల్పోయారు.

కేరళ రాష్ట్రంలో యు డి ఎఫ్ దూకుడు కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఎల్ డి ఎఫ్ ఓటని పాలైంది. ఫలితంగా ఉన్న ఒక రాష్ట్రాన్ని కూడా కమ్యూనిస్టులు కోల్పోయారు. ఒకప్పుడు బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఒక వెలుగు వెలిగారు. త్రిపుర రాష్ట్రంలో కూడా సత్తా చూపించారు. కమ్యూనిస్టు భావజాలం అధికంగా ఉన్న కేరళ రాష్ట్రంలోనే వామపక్షాలు అధికారాన్ని కోల్పోయాయంటే.. ఇక దేశంలో మిగతా రాష్ట్రాలలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. సిద్ధాంతాల ప్రకారం జాతీయతను ఇష్టపడుతున్నారు. భావజాలాన్ని సొంతంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మార్పుకు బలమైన సంకేతాలు. ఈ మార్పును గనుక వామపక్షాలు పాటించకపోతే.. దేశం నుంచి వామపక్ష పార్టీలు పూర్తిగా వామపక్షపాత్రకు పరిమితం కావాల్సిందే. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...
Oktelugu Epaper
Exit mobile version