Who led Mamata Banerjee defeat: బెంగాల్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి చరమగీతం పాడుతూ.. అధికారంలోకి వచ్చేసింది. బెంగాల్ ప్రజలకు బలమైన విశ్వాసం కల్పిస్తామని.. స్థిరమైన అవకాశాలను లభించేలా చేస్తామని.. బెంగాల్ ప్రజలను తల ఎత్తుకునేలా చేస్తామని బిజెపి నేతలు అంటున్నారు. ఎన్నికలకు ముందు బిజెపి నాయకులు బెంగాల్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు మొత్తం నిలబెట్టుకుంటామని బిజెపి నేతలు చెబుతున్నారు.
మమత బెనర్జీ గడచిన 15 సంవత్సరాలుగా బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆమె కంటే ముందు బెంగాల్ రాష్ట్రాన్ని వామపక్షాలు పరిపాలించాయి. వామపక్షాలు సుదీర్ఘకాలం బెంగాల్ రాష్ట్రాన్ని పాలించాయి. అప్పుడు బెంగాల్ ప్రజలకు మమతా బెనర్జీ ఒక ఆశాదీపం లాగా కనిపించారు. దీంతో ఆమె నాయకత్వాన్ని బెంగాల్ ప్రజలు విశ్వసించారు. ఫలితంగా బెంగాల్ రాష్ట్రంలో మమత బెనర్జీ వరుసగా అధికారంలోకి వచ్చింది. అధికారం దక్కిన తర్వాత మమతలో పూర్తిగా మార్పు వచ్చింది. ఆమె ఒక నియంతలాగా బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆమె అల్లుడు షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించడం మొదలుపెట్టారు. వ్యవస్థలు మొత్తం దారి తప్పాయి. చివరికి బంగ్లాదేశ్ ప్రజలకు పౌరసత్వం ఇచ్చే స్థాయికి మమతా సర్కారు ఎదిగిపోయింది. తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ సార్వభౌమ అధికారాన్ని కూడా తాకట్టుపెట్టే స్థాయికి మమత ప్రభుత్వం దిగజారింది.
మమత ప్రభుత్వం చేసిన అనేక తప్పులలో ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరిగిన ఘటన ప్రధానంగా ఉంటుంది. ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్య విద్యార్థి హత్యాచారానికి గురైంది. నాటి ఘటనను మసిపూసి మారేడు కాయ చేయడానికి మమత ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నించింది. వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని అనేకమంది ధర్నాలకు దిగితే.. వారిని తొక్కి పెట్టడానికి మమత ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. నిరసనకారులు హౌరా బ్రిడ్జి వద్ద ధర్నా చేస్తా ఉంటే.. వారందరినీ అడ్డుకుంది మమత ప్రభుత్వం.. నాటి నిరసన కార్యక్రమాల్లో జరిగిన ఓ సంఘటన బెంగాల్ రాజకీయాలలో కీలకమైన మలుపునకు దారి తీసింది. ఆ సంఘటన ఆ రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త నాంది పలికింది.
నాడు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాల సముదాయం వైపు నిరసనకారులు వెళ్లారు. నాడు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ కెనాన్లతో అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సమయంలో ఒక వృద్ధుడు ఒంటరిగా ముందుకు వచ్చాడు. వాటర్ కెనాన్ దెబ్బలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా నిలబడ్డాడు. ఆదృశ్యం నాడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఆ వృద్ధుడు చూపించిన ధైర్యం.. నిర్భయ తత్వం స్థానిక యువత మీద గట్టి ప్రభావం చూపించింది. అతడు నిరసనకు ప్రత్యేకత మారాడు. భయాన్ని పక్కనపెట్టి ప్రతిఘటన అంటే ఎలా ఉంటుందో నిరూపించాడు.. ఆ తర్వాతే బెంగాల్ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. నియంత లాగా ఉన్న మమత వైద్యులతో చర్చలు జరుపుతామని ప్రభుత్వం నుంచి సంకేతాలు పంపించారు..
ఈ సంఘటన బెంగాల్ రాజకీయాలను సమూలంగా మార్చేసిందని కొందరు అంటుంటే.. మరికొందరేమో అన్నాడు జరిగిన ఘటనకు ఓ వృద్ధుడు చూపించిన భావోద్వేగ స్పందన మాత్రమేనని మరికొందరు ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ వృద్ధుడు చూపించిన తెగువ బెంగాల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.