Asaduddin Owaisi Attacked: ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల సమీకరణలు మారుతున్నాయి. పార్టీలు తమ గెలుపు కోసం అన్ని దారులు వెతుకుతున్నాయి. ఇందుకోసం పలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్పై జరిగిన దాడి అదే కోవలో చోటుచేసుకుందని తెలుస్తోంది. కేవలం ఓటు బ్యాంకు కోసమే ఈ తతంగం సాగినట్లు తెలుస్తోంది. యూపీలో జరగనున్న ఎన్నికల్లో లబ్దిపొందే ఉద్దేశంతోనే నామమాత్రంగా దాడి జరిగినట్లు భావిస్తున్నారు. దీంతో ఓట్లు కొల్లగొట్టాలని పక్కా ప్రణాళిక ప్రకారం చేసినట్లుగా సమాచారం.
యూపీలో ప్రస్తుతం బీజేపీ, ఎస్పీ మధ్యే పోటీ నెలకొంది. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని తెలియజేశాయి. దీంతో రెండు పార్టీలు తమ శక్తి యుక్తుల్ని పెడుతున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పోరాడుతున్నాయి. ఇన్నాళ్లు ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు పడేవి. కానీ దాని పతనం ప్రారంభమైన తరువాత ఎస్పీకి మళ్లాయి. దీంతో మస్లిం ఓట్లు ఎస్పీకి పడితే దాని విజయం ఖాయం. అందుకే ఈ కాల్పులు జరిపించి వారి ఓట్లు చీలకుండా చేయడంలో ఓ ప్రయత్నంగానే అసద్ పై కాల్పులు జరగడం అని తెలుస్తోంది.
Also Read: హాట్ ఫోజులతో రెచ్చిపోయిన మీరా జాస్మిన్ !
ముస్లింల ఓట్లు చీలకుండా ఎంఐఎంకు పడితే ఎస్పీకి విజయం దక్కడం అంత సులభంకాదు. అందుకే ఏదో సినీ ఫక్కీలో దాడి జరిగినట్లు చూపించారు. ఇందులో ప్రొఫెషల్స్ పాల్గొంటే కారు టైర్లకు కాదు గురిపెట్టేది సరిగ్గా అసద్ కే ఎక్కుపెట్టేవారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రాజకీయ ఉద్దేశంతోనే ఈ దాడి జరిపించారనే వాదన వస్తోంది. ఇదంతా బీజేపీకే లాభం చేకూరుస్తుందని తెలుస్తోంది.
దీంతో యూపీలో రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. అధికారం కోసం అసదుద్దీన్ పై దాడి జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, ఎస్పీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రచారం ముమ్మరం చేశాయి. మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తుంటే ఈసారి ఎలాగైనా అధికార పీఠంపై కూర్చోవాలని సమాజ్ వాదీ ఆలోచిస్తోంది.
ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయాయి. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాంగ్రెస్, బీఎస్పీలు వెనుకంజలో ఉన్నాయి. దీంతోనే బీజేపీ, ఎస్పీ తమ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అధికారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. దీంతోనే ఎంఐఎం ఓట్లు చీలిపోకుండా చేసే క్రమంలో అసదుద్దీన్ దాడి ఘటనకు కల్పించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Also Read: ‘పిచ్చి పట్టిందా’ అంటూ రాహుల్ రామకృష్ణ పై నెటిజన్లు సీరియస్ !