సరికొత్త రికార్డ్: మోడీ.. ఓటమెరుగని బాటసారి..!

  ఒకటి కాదు..రెండు కాదు.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే నరేంద్రమోడీ ఒక ఆపత్కాళంలో వచ్చాడు. అయినా అడ్డంకులు అధిగమించి రారాజుగా ఎదిగాడు. మోడీ ఇంతవరకు ఆయన సారథ్యంలో ఒక్క ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. అంతటి ఘన చరిత్ర.. ఘనతను సొంతం చేసుకున్నారు. నరేంద్ర దామోదర్‌‌ దాస్‌ మోడీ.. దేశ ప్రధానిగా ఎదిగే క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. ప్రజల బాధలను ముందే తెలుసుకుంటారు. ముందే ఆ సమస్యలకు పరిష్కారమూ చూపుతారు. సామాన్య కుటుంబ నుంచి వచ్చిన ఆయనకు ప్రజల […]

Written By: NARESH, Updated On : October 7, 2020 4:52 pm
Follow us on

 

ఒకటి కాదు..రెండు కాదు.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే నరేంద్రమోడీ ఒక ఆపత్కాళంలో వచ్చాడు. అయినా అడ్డంకులు అధిగమించి రారాజుగా ఎదిగాడు. మోడీ ఇంతవరకు ఆయన సారథ్యంలో ఒక్క ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. అంతటి ఘన చరిత్ర.. ఘనతను సొంతం చేసుకున్నారు.

నరేంద్ర దామోదర్‌‌ దాస్‌ మోడీ.. దేశ ప్రధానిగా ఎదిగే క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. ప్రజల బాధలను ముందే తెలుసుకుంటారు. ముందే ఆ సమస్యలకు పరిష్కారమూ చూపుతారు. సామాన్య కుటుంబ నుంచి వచ్చిన ఆయనకు ప్రజల కష్టసుఖాలు అన్నీ తెలుసు. అందుకే.. ప్రజల మనస్సుల్లో మోడీ జీగా ముద్రపడ్డారు.

Also Read: యోగి ఆదిత్యనాథ్ ది తప్పే లేదంటారా?

2001లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్ ఆ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. దీంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేకుండాపోయింది. మోడీ 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2012 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టారు. 2014 మే 26న ప్రధానమంత్రి పీఠం అధిష్టించారు. 2019 ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రధానిగా మారేవరకు నరేంద్రమోడీ ఒక్కటంటే ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేకపోవడం ఆయన గొప్పతనంగా చెప్పవచ్చు. వరుసగా గుజరాత్ సీఎంగా.. ఆ తర్వాత దేశ ప్రధానిగా సేవలందించారు. ఇదో అరుదైన ఘనతే అని చెప్పాలి. దేశ ప్రధానిగా పలు విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్రమోడీ కొత్త రికార్డును తాజాగా సృష్టించారు. సీఎంగా.. ప్రధానిగా నరేంద్రమోడీ నేటితో 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవడం విశేషంగా చెప్పవచ్చు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అక్టోబర్ 7, 2001లో తొలిసారి గుజరాత్ సీఎంగా మోడీ బాధ్యతలు చేపట్టారు.

Also Read: కేంద్రం ఆర్డర్స్: పండుగల వేళ ఇవి పాటించాల్సిందే..

వరుసగా మూడు సార్లు గుజరాత్ సీఎంగా చేశారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తిరుగులేని నేతగా చక్రంతిప్పారు. ఇలా పాలకుడిగా నరేంద్రమోడీ నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప ఘనతగా చెప్పుకోవచ్చు. గుజరాత్ ముఖ్యమంత్రిగా.. దేశ ప్రధానిగా మోడీ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు.