అక్కినేని నాగచైతన్య హీరోగా చేస్తోన్న ‘లవ్ స్టోరీ’ డబ్బింగ్ ఈ రోజు శబ్ధాలయ స్టూడియోస్ లో మొదలైందని.. ముందుగా చైతు తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారని తెలుస్తోంది. చైతు క్యారెక్టర్ ప్రకారం తెలంగాణ స్లాంగ్ లో చైతు మాడ్యులేషన్ ఉంటుందట. ఇప్పటికే చైతు డైలాగ్ లను బాగా ప్రాక్టీస్ చేశాడని.. అందుకే ఎక్కువ టైం తీసుకోకుండా స్పీడ్ స్పీడ్ గా డబ్బింగ్ పూర్తి చేస్తున్నాడట. మరో వారం రోజులు పాటు చైతు డబ్బింగ్ జరగనుంది.. ఆ తరువాత సాయిపల్లవి తన పాత్రకు డబ్బింగ్ చెప్పనుంది. ఈ నెల మూడో వారం కల్లా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయట. ఇక శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ చైతు – సాయిపల్లవి లాంటి క్రేజీ కాంబినేషన్ తో మరో వినూత్నమైన ప్రేమ కథను తీసుకురాబోతున్నాడు.
Also Read: త్రివిక్రమ్ తో సినిమాపై మహేష్ ఆసక్తికర ట్వీట్
ఇక రీసెంట్ గా ఈ ‘లవ్ స్టోరీ’ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ ను మొదలుపెట్టి ముందుగా చైతు టాకీ పార్ట్ ను పూర్తి చేసి.. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సాయి పల్లవి మీద బ్యాలెన్స్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఫిదాలో తన నటనతో ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుండటం.. అలాగే మజిలీ, వెంకీమామ లాంటి సూపర్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న నాగచైతన్య ఈ సినిమాలో హీరో కావడంతో ఈ సినిమా కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పోటీ పడుతున్నాయి. ఆ మధ్య జీ5 ఏకంగా ఏభై కోట్లు ఆఫర్ ఇచ్చిందనే వార్త బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ కూడా ఈ సినిమాకి ఉన్న మార్కెట్ కంటే కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేస్తోందట.
Also Read: సుశాంత్ కేసులో ట్విస్ట్: రియా ఊపిరి పీల్చుకో..
ఏమైనా, బలమైన ఎమోషనల్ కథలతో సినిమాలు చేసే శేఖర్ కమ్ములకు. సెన్సిబుల్ డైరెక్టర్ గా ఉన్న మంచి పేరు ఉంది. ఆ పేరుకు తగ్గట్లు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా శేఖర్ కు మంచి గిరాకీ ఉంది. అందుకే ఈ సినిమా మార్కెట్ కి అది బాగా ప్లస్ అయ్యేలా ఉంది. పైగా శేఖర్ తో పాటు చైతు, సాయి పల్లవి సూపర్ సక్సెస్ లో ఉండటం, లవ్ స్టోరీలో మంచి మ్యాటర్ ఉందనే టాక్ బయటకు రావడంతో మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుండటం విశేషం.